
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముగింపు దశకు చేరుకుంది. 2019 నుండి ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఫైనల్ జూన్ 18న జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లను పరిశీలిద్దాం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ మార్నస్ లబూషేన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 23 ఇన్నింగ్స్‌లలో 72.82 సగటుతో 1675 పరుగులు చేశాడు.

ఈ జాబితాలో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ రెండవ స్థానంలో ఉన్నాడు. రూట్ 20 మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌లలో 1660 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాకు చెందిన వెటరన్ స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ స్మిత్ 63.85 సగటుతో 1341 పరుగులు చేశాడు.

నాలుగవ స్థానంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. ఈ టోర్నమెంట్‌లో స్టోక్స్ 17 మ్యాచ్‌ల్లో 1334 పరుగులు చేశాడు.

ఐదో స్థానంలో భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఉన్నాడు. రహనే 28 ఇన్నింగ్స్‌లలో 1095 పరుగులు చేశాడు. అదే సమయంలో, రోహిత్ శర్మ 17 ఇన్నింగ్స్‌లలో 1030 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 22 ఇన్నింగ్స్‌లలో 877 పరుగులు చేశాడు.