
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 336 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌కు కేవలం రెండో మ్యాచ్ మాత్రమే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న గిల్.. రెండో మ్యాచ్‌తోనే చరిత్ర సృష్టించాడు. అతను, అతని కెప్టెన్సీలో టీమిండియా నెలకొల్పిన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీమిండియా ఏకంగా 336 పరుగుల తేడాతో ఓడించింది. విదేశాల్లో టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం. గతంలో అంటే 2016లో నార్త్ సౌండ్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. ఆ రికార్డును ఇప్పుడు కెప్టెన్ గిల్ అండ్ కో బద్దలు కొట్టింది.

ఇక రెండో అతిపెద్ద రికార్డు ఏంటంటే.. ఈ మ్యాచ్ జరిగిన గ్రౌండ్ ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటి వరకు టీమిండియాకు అసలు విజయం అనేదే లేదు. ఇదే భారత జట్టు ఈ మైదానంలో మొట్టమొదటి టెస్టు ఈ విజయం. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్‌లో టీమిండియా 18 మ్యాచ్‌లు ఆడింది. కానీ, ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా ఈ చరిత్ర లఖించింది.

కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వ్యక్తిగత రికార్డు విషయానికి వస్తే.. టెస్టుల క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు(రెండు ఇన్నింగ్స్‌లు కలిపి) చేసిన రెండో ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసి మొత్తంగా 430 పరుగులు సాధించాడు.

ఇక గిల్ కెప్టెన్సీలోని టీమిండియా మరో కొత్త రికార్డును సాధించింది. అదేంటంటే.. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 30 టెస్టు విజయాలను ఈ గెలుపుతో పూర్తి చేసుకుంది. ఇలా సెనా దేశాల్లో 30 టెస్టు మ్యాచ్‌లు గెలిచిన మొట్టమొదటి ఆసియా టీమ్‌గా భారత్ కొత్త చరిత్ర సృష్టించింది.