Road Safety World Series: సచిన్‌ టెండూల్కర్‌కు ఇది స్పెషల్ డే.. తన లాస్ట్ వన్డేలో ఎన్ని రన్స్ చేశాడో తెలుసా.?

|

Mar 18, 2021 | 8:19 PM

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ఎన్ని పరుగులు చేసాడో తెలుసా.!

1 / 6
క్రికెట్ గాడ్‌గా పిలువబడే సచిన్ టెండూల్కర్ తన 24 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులను సృష్టించాడు. ఈ రోజు సచిన్ కెరీర్‌లో ఒక ప్రత్యేక రోజు

2 / 6
18 మార్చి 2012న సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ సంవత్సరం ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తన లాస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక సచిన్ తన మొదటి మ్యాచ్‌ను సైతం 1989లో పాకిస్థాన్‌తోనే ఆడాడు.

3 / 6
 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లకు 6 వికెట్లకు నష్టపోయి 329 పరుగులు చేసింది. దీని తరువాత సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీతో కలిసి 132 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు.

4 / 6
సచిన్ టెండూల్కర్ తన చివరి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ కొట్టాడు. 48 బంతుల్లో 52 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. సచిన్ ఇన్నింగ్స్ టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించింది.

5 / 6
సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 463 మ్యాచ్‌లు ఆడాడు, ఇది ఒక రికార్డు. ఇక అతడి ఖాతాలో 18,426 పరుగులు ఉండగా.. అందులో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో సచిన్ సాధించిన వ్యక్తిగత స్కోర్ 200 నాటౌట్.

6 / 6
సచిన్, యువరాజ్ తాజాగా జరిగిన ఇండియా లెజెండ్స్, వెస్టిండిస్ లెజెండ్స్ మ్యాచ్‌లో అదరగొట్టారు. యువరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదగా.. సచిన్ తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు.