
డిసెంబర్ 10 ఆదివారం డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ క్రికెట్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. దీంతో భారత్-ఆఫ్రికా మధ్య సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కానుంది.

శుభమాన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రావడంతో, మెన్ ఇన్ బ్లూ చాలా బలంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా టీ20 సిరీస్‌లోకి అడుగుపెడుతోంది.

దక్షిణాఫ్రికా పిచ్‌లు సాధారణంగా బౌలింగ్‌కు అనుకూలమైనవిగా పరిగణిస్తుంటారు. ఇక్కడ బౌన్స్, స్వింగ్ ఎక్కువగా ఉన్నందున, కింగ్స్‌మీడ్ క్రికెట్ స్టేడియం కూడా అదే పద్ధతిలో ఉంది. పిచ్‌పై కొంత బౌన్స్ ఉంటుంది. అయితే, బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుందని భావిస్తున్నారు.

అవుట్ ఫీల్డ్ వేగంగా ఉంది. పరుగుల వర్షం కురుస్తుంది. మొత్తం మీద కింగ్స్‌మీడ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్ హై స్కోరింగ్ గేమ్. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ ఎంచుకోవడం ఖాయం. అయితే ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు రికార్డు కాస్త అనుకూలంగానే ఉంది.

కింగ్స్‌మీడ్‌లో జరిగిన 18 టీ20 మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు 8 సార్లు గెలుపొందగా, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 9 సార్లు విజయం సాధించాయి. ఈ వేదికపై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 143.

డర్బన్ వేదికపై మెన్ ఇన్ బ్లూ గొప్ప ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. కింగ్స్‌మీడ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఉత్కంఠగా టైగా ముగిసింది. వర్షం కారణంగా మిగతా మ్యాచ్‌లు రద్దయ్యాయి.