అన్నకంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతుందంటే?

Updated on: Mar 06, 2026 | 5:04 PM

హిందూ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే హిందూ సంప్రదాయాల ప్రకారం, ఆచారాలను అనుసరించి ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు. ఇక మన హిందూ ధర్మంలో అన్నకంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది లవ్ మ్యారేజ్ అంటూ అన్నకంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇలా చేసుకోవడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

1 / 5
అన్న కంటే తమ్ముడు ముందు వివాహం చేసుకోవడం అస్సలే మంచిది కాదంట, అన్నయ్య కంటే, తమ్ముడు ముందు వివాహం చేసుకోవడం వలన అతను పరివేద దోషం బారినపడతాడంట. దీని వలన తమ్ముడి వైవాహిక జీవితంలో అడ్డంకులు రావడం, ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం, అనారోగ్య సమస్యలు, వంటి ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

2 / 5
ఇంటి మొదటి కొడుకు,  వివాహం చేసుకొని, గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు. సంతానం ద్వారా పితృరుణం తీర్చుకుంటాడు. అయితే అన్నకంటే ముందు తమ్ముడు వివాహం చేసుకోవడం వలన గృహస్థాశ్రమంలోకి అన్న కాకుండా, తమ్మడు ప్రవేశం జరుగుతుంది, ఇది క్రమబద్ధతను భంగపరచడమే కాకుండా, ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట.

3 / 5
అన్నయ్య ఇంటికి ప్రథమ స్థానం కాబట్టి, తాను వివాం చేసుకున్న తర్వాత తమ్మడు చేసుకోవాలంట. లేకపోతే తమ్మడు పరివేష్టిత దోషం బారిన పడి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అంతే కాకుండా తమ్ముడి తర్వాత అన్న వివాహం చేసుకున్నా ఈ దోషం ఇద్దరికీ సమస్యలను తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు.

4 / 5
కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అన్నకంటే తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చునంట. అది ఎప్పుడు అంటే. అన్న వికాలంగుడు, మానసిక స్థితిలేని వాడు, శారీరక అసమర్థుడు. లేదా నేను ఎప్పటికీ వివాహం చేసుకోను అని చెబితే, ఆ సందర్భంలో తమ్ముడు ముందుగా వివాహం చేసుకున్నా, ఎలాంటి దోషాలు ఉండవు అని చెబుతున్నారు పండితులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us