
జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాస్తు నిపుణులు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే వచ్చే నూతన సంవత్సరం మొత్తం కలిపితే నెంబర్ వన్ సంఖ్య వస్తుంది. అంటే 2026( 2+0+2+6=10,1+0=1) మొత్తం సంఖ్య ఒకటి కాబట్టి ఇది సూర్య భగవానుడికి సంబంధించిన సంఖ్య.

అంటే ఈ సంవత్సరం మొత్తం సూర్యడిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే? సూర్య భగవానుడి పాలించే నెంబర్ ఒకటో నెంబర్. అందువలన ఈ సంవత్సరం సంఖ్యను కలపగా ఒకటి వస్తుంది. అందుకే ఇది సూర్య భగవానుడి సంవత్సరంగా కూడా చెబుతుంటారు. అయితే ఈ సంవత్సరంలో ఎవరు అయితే, సూర్యుడిని ఆరాధిస్తారో వారికి కలిసి వస్తుందంట.

అదే విధంగా ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడిని ప్రార్థించడం చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. అంతే కాకుండా, 2026లో ఎవరు అయితే తమ ఇంటికి తూర్పు భాగంలో సూర్యుడి ప్రతిమను ఏర్పాటు చేసి పూజిస్తారో, వారి ఇంటిలో దరిద్రం పోయి కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అంతే కాకుండా వారి ఇంటిలోపల అష్టైశ్వార్యాలు కలుగుతాయంట.

అంతే కాకుండా కొత్త సంవత్సరంలో మీ ఇంటి తూర్పు భాగాన్ని ఎరుపు రంగు కలర్‌తో అందంగా ముస్తాబు చేయడం వలన కూడా మీపై సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడం, అప్పుల బాధనుంచి బయటపడటం వంటిది జరుగుతుందంట. అందుకే ఇంటిలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి రావాలి అంటే ఈ సంవత్సరం సూర్యభగవానుడిని పూజించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అలాగే 2026లో ఎవరు అయితే వివాహం నిశ్చయం కోసం ఎదురు చూస్తున్నారో వారు, ఏక ముఖం లేదా పన్నెండు ముఖాలున్న రుద్రక్షాలను పూజ స్థలంలో ఉంచి, పూజించడం వలన సూర్య భగవానుడి ఆశీర్వాదం లభించి, కోరిన కోర్కెలు నెరవేరుతాయంట. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారంట.