5 / 5
అప్పటి నుంచి గజాననుడు పండపల్లో 'గణపతి బప్పా మోరియా' నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్త వల్లభుడైన గజకర్ణుడు సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా.. అని మరాఠీ లో నినదించడం సర్వ సాధారణమైపోయింది. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి.. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.అందుకే ‘గణపతి బప్పా మోరియా’ అనే పదం ఇపుడు సర్వ సాధారణమైపోయింది.