
ప్రేమకు, సంపదకు, సౌందర్యానికి కారకుడైన శుక్ర గ్రహం ఆగస్టు 25 మధ్యాహ్నం12: 55 గంటలకు కుజుడికి సంబంధించిన నక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు చేకూర్చనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

కుంభ రాశి : కుంభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు వలన చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో విజయం అందుకుంటారు. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇలా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతే కాకుండా ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం పెరగడం వలన కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. పోటీ పరీక్షల్లో మంచి విజయం అందుకుంటారు. ఆనందకర జీవితాన్ని గడుపుతారు.

తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే గోల్డ్ కొనుగోలు చేయాలి అని ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి గోల్డ్ కొనుగోలు చేయాలి అనుకునే వారు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేస్తారు.

మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా ఆనందంగా జీవిస్తారు. విద్యార్థులకు ,వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి.