Vastu Tips: శంఖు పుష్ప మొక్క పెంచడంలో కూడా వాస్తు నియమాలు.. శని దోష నివారణకు ఏ దిశలో పెంచాలంటే..

|

Aug 03, 2023 | 7:52 AM

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి వస్తువు వాస్తుకు సంబంధించినదని నమ్ముతారు. కాబట్టి వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణం, బావి, టాయిలెట్ వంటి నిర్మాణంలో టిప్స్ ను చూడడమే కాదు.. ఇంటిలో ఉండే వస్తువులు, ఆవరణంలో ఉన్న మొక్కలు విషయంలో కూడా వాస్తు నియమాలు పాటిస్తారు. ప్రస్తుతం చాలా మంది వాస్తు శాస్త్రాన్ని ఉపయోగిస్తూ ఏదైనా వస్తువుకు సంబంధించిన నియమాలను తెలుసుకోవచ్చు. 

1 / 5
ఇంట్లో పెంచుకునే మొక్కలకు వాస్తు నిర్దిష్ట సూచనలను కూడా ఇస్తుంది. ఇంటి ఆవరణలో తోటను ఏర్పాటు చేసేటప్పుడు లేదా ఇంట్లో ఏయే మొక్కలు పెంచాలో ఏమి చేయాలో వాస్తు శాస్త్రం ఖచ్చితంగా నిర్వచించింది. మన ఇళ్లలో సాధారణంగా కనిపించే శంఖపుష్పం గురించి వాస్తు శాస్త్రంలో ఏం పేర్కొన్నారో ఈ రోజు తెలుసుకుందాం.. 

2 / 5
ఇంట్లో శంఖపుష్పం మొక్కను నాటడం సుఖ సంపదలను పెంచుతుందని  ఆకర్షిస్తుంది అని నమ్ముతారు. అయితే ఇంట్లో మొక్కను ఏ దిశలో నాటాలనేది కీలకం. శంఖపుష్పంను ఉత్తరం, తూర్పు , ఈశాన్య దిశలలో నాటడం మంచిది. ప్రధాన ద్వారానికి కుడివైపున కుండీలో శంఖు పుష్పాన్ని ఉంచడం శుభప్రదమని వాస్తు కూడా చెబుతోంది.

3 / 5
ఈ మొక్కను గురువారం, శుక్రవారం నాటడం మంచిది. గురువారం విష్ణుమూర్తికి, శుక్రవారం లక్ష్మికి అంకితం అని విశ్వాసం. శంఖపుష్పం మొక్కను పెంచుకోవడం వలన ఆర్ధిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది.  

4 / 5
శంఖపుష్పం ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. ఇంట్లో ఈ మొక్కను శ్రద్దగా పెంచాల్సి ఉంటుంది. అంతేకాదు శంఖు పుష్పం నుంచి వచ్చే గాలి మంచిదని.. వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. శంఖు పువ్వును నాటడం ద్వారా ఎవరి జాతకంలోనైనా శనిదోషం ఉంటే తొలగిపోతుందని అంటారు.

5 / 5
శంఖపుష్ప మొక్కకు ఎండిన కొమ్మలు, ఆకులు, ఎండిన పువ్వులుంటే వాటిని తొలగిస్తూ సరైన పోషణ ఉండే విధంగా చూపించాలి. ఎండిన మొక్క ఉండడం వలన ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంట్లో ఉన్న మొక్క చనిపోతే వెంటనే మరో మొక్కను నాటాలి. లేకపోతే, ఇంట్లోని సుఖ సంపదలపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు.