Vastu Tips: ఇంట్లో కరివేపాకు మొక్కను ఏ దిశలో పెంచుకోవడం వాస్తు ప్రకారం శుభ ఫలితాలను ఇస్తుందంటే..

|

Jun 25, 2024 | 8:35 AM

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం, ఇంట్లోని వస్తువుల గురించి మాత్రమే కాదు ఇంటి ఆవరణలో ఉండే మొక్కల విషయంలో కూడా వాస్తు శాస్త్రం అనేక విషయాలను పేర్కొంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లేదా బాల్కనీలో ఇలా అనువైన ప్రదేశంలో మొక్కలను పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుకోవాల్సి ఉంటుంది. చెట్లు, మొక్కలను పెంచుకోవడానికి సరైన దిశలను ఎంచుకోవాలి. అయితే కొంతమంది తెలిసి తెలియక చేసే పనులు వలన ఆ ఇంట్లో నివసించే వ్యక్తులకు కష్టాలు, నష్టాలూ తప్పవని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 6
ఇంట్లో పెట్టుక్కునే ప్రతి వస్తువుకు దాని స్థానం ఉందని వాస్తు శాస్త్రం చెప్పినట్లే మొక్కలు నాటడానికి కూడా సరైన స్థానం అవసరం అని పేర్కొంది. కనుక వాస్తు శాస్త్రంలో సూచించినట్లు చెట్లు, మొక్కల పెంపకానికి సరైన దిశలను ఎంచుకోవాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. లక్ష్మిదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో జీవిస్తారు. ఈ నేపద్యంలో వంటల్లో విరివిగా ఉపయోగించే ఔషధాల గని కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి సరైన స్థలం ఉందని తెలుసా.. ఎక్కడ ఏ దిశలో నాటడం శుభఫలితాలు పొందుతారో ఈ రోజు తెలుసుకుందాం..

2 / 6
కరివేపాకు మొక్కను నాటడానికి అనువైన దిశ ఇంటికి పడమర దిశ. ఈ దిశను చంద్రుడి దిశగా చెబుతారు. కనుక కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి అనువైన ప్రదేశం. ఇక్కడ ఈ మొక్కను పెంచుకోవడం వలన శుభ ఫలితాలను ఇస్తుంది. అనేకాదు నెగెటివ్ ఎనర్జీ తొలగి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని విశ్వాసం.

3 / 6
కరివేపాకు మొక్కను పెంచుకుంటున్న ప్రాంతలోకి మురికి నీరు పారుదల లేకుండా చూసుకోవాలి. సింక్ నుంచి వృధా నీరు పోయే ప్రాంతంలో పొరపాటున కూడా కరివేపాకు నాటవద్దు.

4 / 6
కరివేపాకు మొక్కకు చీడ పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గొంగళి పురుగులు వంటివి పట్టకుండా మొక్క ఆరోగ్యంగా పెరిగేలా తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎప్పుడైనా చీడ పట్టినట్లు కనిపిస్తే ఆ భాగాన్ని వెంటనే తొలగించడం ఉత్తమం.

5 / 6
ఇంట్లోని కరివేపాకు చెట్టు ఎండినా, తగిన శ్రద్ధ చూపకపోవడంతో చీడ పట్టినా ఆ ప్రభావం ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులపై చూపిస్తుందని నమ్మకం. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. ఇంటి సామరస్య వాతావరణానికి విఘాతం ఏర్పడుతుంది.

6 / 6
కరివేపాకు చెట్ల పక్కన కొన్ని రకాల చెట్లను పొరపాటున కూడా పెంచవద్దు. ముఖ్యంగా చింత చెట్టు.. కరివేపాకు చెట్టు పక్కపక్కన పెంచుకోవద్దు. ఇలా చేయడం శుభకరం కాదు. ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది