ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?

Updated on: Apr 17, 2026 | 5:34 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు అనేది పాటిస్తారు. ఇక కొంత మంది ఇంటి నిర్మాణం అంటే ప్లానింగ్, ఇల్లు, ఇటుక, సిమెంట్ అనుకుంటారు. కానీ ఇంటి నిర్మాణం అనేది పంచభూతాలపై ఆధార పడి ఉంటుంది. పునాది నుంచి ఇంటి గోడలు, మెట్లు , ఇంటి కౌంపౌండ్ కూడా కీలకంగా ఉంటాయి. ఇవి సరైన దిశలో ఉన్నప్పుడు మాత్రమే ఇంటిలోని వారు చాలా ఆనందంగా ఉంటారు. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం విషయంలో తప్పకుండా ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు పాటించకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదురు అవుతాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఇంటి నిర్మాణం చేసే సమయంలో తప్పకుండా పునాది చాలా బలంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పునాది తీసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి. ఇంటి పునాది ఎంత బలంగా ఉంటే ఇల్లు అంత దృఢంగా ఉంటుంది.

2 / 5
ఎప్పుడు కూడా నైరుతి దిశలో పునాది మరింత లోతుగా బలంగా, బరువుగా ఉండేలా చూసుకోండి. బలహీనంగా ఉంటే, ఇంటిలో ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే పునాది తీసేటప్పుడే వాస్తు నియమాలు పాటించాలి. ముఖ్యంగా వాస్తు ప్రకారం, ఇంటి నేల మట్టం రోడ్డు కంటే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

3 / 5
గోడల నిర్మాణం విషయంలో జాగ్రత్తలు, ఈ మధ్య కాలంలో చాలా మంది గోడల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అన్నీ ఒకే విధంగా కడుతున్నారు. కానీ ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో దక్షిణం, పడమర వైపు గోడలు కాస్త మదంగా ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉత్తరం తూర్పు గోడలు కాస్త పలచగా, ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సంతోషకర వాతావరణం పెరుగుతుంది.

4 / 5
అలాగే చాలా మంది వేరే ఇంటి వాళ్ల ఇంటి గోడను ఆనిచ్చి ,ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. దీని వలన వాస్తు దోషాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందువలన గోడల మధ్య కనీసం ఒకటి లేదా రెండు ఫీట్ల దూరం ఉండాలి. ఇలా చేయడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తవు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us