
వృషభం: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు గురువు అనుగ్రహం కూడా కలుగుతున్నందువల్ల సరైన పూజా కార్యక్రమంతో వరలక్ష్మీ దేవి కటాక్షం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు నుంచి వీరికి ఆదాయపరంగా దశ తిరగబోతోంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కలలో కూడా ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది.

మిథునం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారు వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆశలు, ఆకాంక్షలు సాకారం అవుతాయి. వీరు వరలక్ష్మీ దేవిని నియమ నిష్ఠలతో పూజించడం వల్ల బాగా లాభం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించి ఆర్థిక లాభాలు పొందుతారు. అనేక మార్గాల్లో ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

కన్య: ఈ రాశికి వరలక్ష్మీ వ్రతం పర్వదినం తర్వాత నుంచి కలలో కూడా ఊహించని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతోంది. ఈ రాశిలో ఉన్న శుక్రుడు, లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు కారణంగా వీరు అతి త్వరలో సంపన్నులు కాగల సూచనలున్నాయి. వరలక్ష్మీ దేవి పూజతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక కుటుంబపరంగా కూడా ఆర్థికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది.

వృశ్చికం: ఈ రాశికి గతంలో ఎన్నడూ లేని విధంగా వరలక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉంది. భాగ్య స్థానంలో గురువు, లాభ స్థానంలో శుక్రుడి వల్ల ఆర్థిక పరిస్థితి గతం కన్నా బాగా మెరుగుపడు తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ధన ధాన్య వృద్ధి యోగం పడుతుంది. ఆదాయం బాగా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి.

మకరం: వరలక్ష్మీ వ్రతం రోజుతో వీరికి దశ తిరిగే అవకాశం ఉంది. వీరు వరలక్ష్మీ దేవిని ఆ రోజున ఎంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే అంత మంచిది. గురు, శుక్రుల అనుకూలత వల్ల ధన ధాన్య వృద్ధి యోగం కలగబోతోంది. కొద్దిపాటి ఆదాయ ప్రయత్నాలతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది.

మీనం: వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలావరకు తీరబోతున్నాయి. రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, సప్తమ స్థానంలో శుక్రుడి సంచా రం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. వరలక్ష్మీ దేవిని నియమ నిష్ఠలతో పూజించడంవల్ల వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయట పడతారు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతాయి.