
ఆవులు మీ ఇంటికి పదే పదే వస్తే.. అది శుభకాలానికి సంకేతం. అంటే దేవతల ఆశీస్సులు మీపై ఉన్నాయని .. మీకు శుభ సమయం త్వరలో ప్రారంభం కానున్నదని ఆవుల రాకకు అర్థం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు కలలో మంత్రం, గంట లేదా శంఖం శబ్దం విన్నట్లయితే.. అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో శంఖం లేదా గంట శబ్దం వినడం మంచి రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది.

మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో నీటితో నిండిన పాత్రను చూసినా.. లేక నిండు కుండ ఎదురు వచ్చినా.. అది రాబోయే మంచి రోజులకు సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. దీనితో పాటు, కలలో నీటితో నిండిన పాత్రను చూడటం కూడా రాబోయే మంచి రోజులకు సంకేతం.

మీ చేతుల్లో అకస్మాత్తుగా దురద అనిపిస్తే.. అది రాబోయే మంచి రోజులకు సంకేతంగా పరిగణించబడుతుంది. చేతుల్లో దురద మీ చెడు సమయం ముగియబోతోందని సూచిస్తుంది. అలాగే కొన్ని శరీర భాగాలు కుంచించుకుపోవడం కూడా మంచి సమయాన్ని సూచిస్తుంది.

సనాతన ధర్మం ప్రకారం అకస్మాత్తుగా మీ ఇంటికి నల్ల చీమలు గుంపులు గుంపులుగా వస్తే.. అది లక్ష్మీదేవి ఆశీస్సులకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఇంట్లోకి నల్ల చీమలు అకస్మాత్తుగా రావడం అంటే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని ముందుగా సూచిస్తున్నాయి.

మీ ఇంట్లో అకస్మాత్తుగా మంచి వాసన రావడం అంటే.. అది రానున్న మంచి కాలానికి సంకేతం అని కూడా అంటారు. ఇంట్లో అకస్మాత్తుగా మంచి వాసన వస్తే.. ఆది మీ జీవితంలో కూడా మంచి మార్పులు రానున్నాయని అర్ధం చేసుకోవాలట.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చీపురును పదే పదే కలలో చూస్తే.. అది రాబోయే మంచి రోజులకు సంకేతం కావచ్చు. ఉదయం చీపురు చూడటం లేదా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చీపురు చూడటం లక్ష్మీ దేవి ఆశీర్వాదానికి సంకేతం.