
ఏలినాటి శనితో బాధపడే వారు దాని నుంచి ఉపశమనం పొందడానికి, శని ప్రభావం తగ్గించుకోవడానికి నలుపు లేదా, నీలం రంగు దుస్తులు ధరించడం చాలా మంచిదంట. దీని వలన శని అనుగ్రహం కలిగి, ఏలినాటి శని ప్రభావం కొంత మేర తగ్గుతుందని చెబుతున్నారు పండితులు.

అదే విధంగా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన కూడా శని నెగిటివ్ ప్రభావం కాస్త తగ్గుతుందంట. అదే విధంగా, శని అనుగ్రహం కలిగి, కుటుంబంలో శాంతి లభిస్తుంది. అంతే కాకుండా ఇతర గ్రహా దోషాలు కూడా తొలిగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

శని దేవుడిని శాంతింప చేసి, ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవాలి అంటే, శని వారం రోజున శని దేవుడిని పూజించాలి. అదే విధంగా ఈ రోజున శని వ్రతం ఆచరించడం, ఉపవాసం ఉండటం వలన శని చెడు ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా , నీలాంజన్ సమాభసం రవిపుత్రం యమాగ్రజం.. ఛాయా మార్తాండ్ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని జపించడం వలన ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందంట.

ప్రతి శని వారం నల్ల నువ్వులు , నల్ల ఉప్పు, ఆవాల నూనె , పాదరక్షలు దానం చేయడం వలన కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందంట. దీని వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

ప్రతి రోజూ శని దేవుడిని పూజిస్తూ, శని మహదేవ్ మంత్రాలు జపించడం వలన కూడా శని చెడు, ప్రతి కూల ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమ: అనే మంత్రం ప్రతి రోజూ 108 సార్లు జపించడం వలన శని దేవుడు శాంతించి, ప్రతి కూల ప్రభావాన్ని తగ్గిస్తాడు. ప్రశాంతతను కలిగిస్తాడంట. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అని చెబుతున్నారు పండితులు.