మేడారం వెళ్తున్నారా.. అయితే తప్పక విజిట్ చేయాల్సిన బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవే!

Updated on: Jan 17, 2026 | 12:14 PM

తెలంగాణ కుంభమేళ మొదలైంది. రాష్ట్రంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఇది. ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం మేడారంలో రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా ఇది ప్రసిద్ధి చెందిన ఈ వన జాతరకు వెళ్లి వీర వనితలైన సమ్మక్క సారలమ్మలను కొన్ని కోట్ల మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే ఈ జాతరకు మీరు కూడా వెళ్తున్నారా?.. మేడారం బయల్దేరారా? అయితే తప్పకుండా దగ్గరిలోని ఈ ప్రదేశాలు కూడా సందర్శించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
లక్నవరం సరస్సు : మేడారానికి అతిదగ్గరిలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతం లక్నవరం సరస్సు. చుట్టూ కొండలు, చెట్ల మధ్య ఉండే అందమైన సరస్సు, చుట్టూ ఉన్న చిన్న చిన్న ద్వీపాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మేడారం వెళ్లేవారు తప్పకుండా ఈ ప్రదేశం చూసి తీరాల్సిందే అంటున్నారు, ప్రకృతి ప్రేమికులు.

2 / 5
బయ్యక్క పేట : బయ్యక్క పేట సమ్మక్క జన్మించిన గ్రామం. మొదట సమక్క సారక్క జాతర ఈ గ్రామంలోనే జరిగిందంట. ఇక్కడ సమ్మక్క  జన్మించినప్పుడు ఉన్న పుట్ట, ఆమె నివసించిన ఇల్లు, వీటన్నింటిని చూడొచ్చు. అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఇది. అంతే కాకుండా ఇప్పటికీ ఈ ఇంటిలో సమ్మక్క తల్లి పాములా నివసించి ఉంటుందని అక్కడి వారు నమ్ముతారు.

3 / 5
గిరిజన మ్యూజియం : మేడారం దగ్గర రెడ్డిగూడెం సమీపంలో గిరిజన మ్యూజియం ఉంది. మేడారం వెళ్లేవారు తప్పకుండా దీనిని చూసి రావాల్సిందేనంట. ఆదివాసీల సంసృతి సంప్రదాయాలతో కూడిన ఈ చిత్రాలు, సమ్మక్క సారలమ్మ వాడిన వస్తువులు, వీర వనితల జీవిత చరిత్రను చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. అందువలన తప్పకుండా దీనిని సందర్శించాల్సిందేనంట.

4 / 5
రామప్ప ఆలయం : కాకతీయుల అద్భుత నిర్మాణానికి నిదర్శనం రామప్ప ఆలయం. ఈ ఆలయం సౌందర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయం మేడారం జాతరకు చాలా దగ్గరిలో ఉంటుంది. అందువలన వన దేవతలను దర్శించుకునేవారు తప్పకుండా ఈ ప్రదేశాలు చుట్టి రావాలి.

5 / 5
బోగత జలపాతం : ములుగు జిల్లాలో ఉన్న అందమైన జలపాతం బోగత జలపాతం. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా చుట్టూ చెట్లు, కొండలు, పచ్చటి ప్రకృతి మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది అందమైన ప్రదేశం అని చెప్పాలి.