మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. తినాల్సినవి, తినకూడని ఆహారాలు ఇవే!

Updated on: Feb 25, 2025 | 2:56 PM

మహాశివరాత్రి వచ్చేసింది. ఫిబ్రవరి 26న ప్రతి పల్లెలో, పట్టణంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగిపోతాయి. అయితే ఈరోజు శివ భక్తులందరూ ఉపవాసం ఉంటూ, ఆ పరమశివుడిని భక్తి శ్రద్ధలతో కొలుకుకుంటారు. అయితే ఉపవాసం చేసేవారు ఆరోజు ఏ ఆహారాలు తినాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏవి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మహాశివరాత్రికి ఉపవాసం ఉండే వారు త్రయోదశి రోజున ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలంట. అలాగే రాత్రంతా పూజ ప్రారంభించే ముందు స్నానం చేయాలంట.

2 / 5
అయితే శివరాత్రి రోజు భక్తులు పూజను రాత్రిపూట ఒకసారి లేదా నాలుగుసార్లు చేయవచ్చునంట. ఉపవాసం ఉన్న రోజున ఉదయాన్నే నిద్రలేచి, పవిత్రస్నానం చేసి, కొత్తబట్టలు ధరించాలి.

3 / 5
వీరు నీరు, పాలు, తేనె, గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి, శివలింగంపై కొబ్బరి నీళ్లు చల్లకూడదు, శివుడికి సమర్పించినవి ఏవి కూడా వీరు తినకూడదంట. అలాగే, టీ, కాఫీలు కూడా తాగకూడదంట.

4 / 5
ఉపవాసం ఉన్న భక్తులు పండ్లు, పాలు, అరటిపండు, చిరుధాన్యాలు, బంగాళాదుంప, డ్రైఫ్రూట్స్ వంటివి తినాలి అంటున్నారు పండితులు.

5 / 5
గోధుమ రొట్టె, బియ్యం వంటి ధాన్యాలు, పప్పు, చిక్కుళ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహార ఆహారాలు,  వంటివి ఉపవాసం చేసే వారు అస్సలే తినకూడదు. ఉదయం స్నానం చేసిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమించాలంట.