భారత దేశం వెలుపల హిందూ దేవాలయంలో అన్నీ మిస్టరీలే.. ఉప్పునీటి సముద్రంలో మంచి నీటి బుగ్గ.. ఔషధ గుణాలు..

Updated on: May 10, 2025 | 7:37 PM

ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశంలో హిందువులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. బాలిలోని తబనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తనాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు. సముద్రంలో ఉన్న ఒక రాతిపై ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణం, సూర్యాస్తమయ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు

1 / 9
తనహ్ లాట్ ఆలయం దీని  సహజ సౌందర్యంతో పాటు, బాలినీస్ హిందువులకు కూడా ఒక ముఖ్యమైన ప్రార్థనా స్థలం. స్థానిక హిందువులు ఈ ఆలయాన్ని సముద్ర సంరక్షక దేవతకు అంకితం చేశారని నమ్ముతారు. మాయా ప్రకాశం, అద్భుతమైన దృశ్యాలు తనహ్ లాట్ ఆలయాన్ని ఎవరైనా తప్పక చూడవలసిన గమ్యస్థానంగా చేశాయి.

2 / 9
బాలిలో తప్పక సందర్శించాల్సిన దేవాలయాలలో ఒకటి తనహ్ లాట్ ఆలయం. ఇది హిందూ మహాసముద్రంలో ఒక అద్భుతమైన రాతిపై ఉన్న ఆలయం అద్భుతమైన నిర్మాణం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇది తీరప్రాంతం నుంచి కేవలం 20 మీటర్లు (65.6 అడుగులు) దూరంలో ఉన్న 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాతిపై నిర్మించబడింది.

3 / 9
ఈ హిందూ దేవాలయం సముద్రం, భూమి రెండూ కలసి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ మహాసముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తుంటాయి. ఒకసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ నీటిలో మునిగిపోతాయి. అల వెళ్లగానే ఆలయానికి వెళ్లేందుకు మెట్ల మార్గం కనిపిస్తుంది. ఆ సమయంలోనే ఆ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

4 / 9
బాలిలోని సముద్ర దేవతలకు (దేవా బరుణ లేదా భటర సెగర లేదా నోరర్థ) అంకితం చేయబడిన ఏడు సముద్ర దేవాలయాలలో ఇది ఒకటి. ఇవి బాలి ద్వీపం తీరప్రాంతం చుట్టూ నిర్మించబడ్డాయి. బాలిని దుష్ట సముద్ర ఆత్మల నుంచి రక్షిస్తాయని నమ్ముతారు.

5 / 9
ఇది 16వ శతాబ్దంలో భగవాన్ డాంగ్ హయాంగ్ నిరర్థ అనే బ్రాహ్మణుడు జావా నుంచి బాలిలో హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి వెళ్ళినప్పుడు ప్రారంభమైంది. అతను తబానన్‌లోని ఒక గ్రామంలో ప్రజలతో కలిసి కొన్ని ప్రార్థనలు చేసాడు. తరువాత బీచ్ వెంబడి నడిచాడు. తన పవిత్రమైన, అతీంద్రియ మార్గదర్శకత్వం ప్రకారం తనహ్ లాట్ ఉన్న ప్రదేశానికి చేరుకున్న  తర్వాత దేవుడిని ఆరాధించడానికి ఇది సరైన, పవిత్రమైన ప్రదేశం అని కనుగొన్నాడు. ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించమని ప్రజలకు సలహా ఇచ్చాడు.

6 / 9
తనహ్ లాట్ ఆలయంలో మరొక విశిష్టత ఏమిటంటే.. ఈ ఆలయం సముద్రపు ఉప్పు నీటితో చుట్టుముట్టబడి ఉనది. అయితే ఆలయం కింద ఒక గుహ, మంచినీటి బుగ్గ ఉంది. ఈ నీటిలో ఆత్మలను శుద్ధి చేసే శక్తి, వ్యాధులను నయం చేసే శక్తి  కలిగి ఉందని స్థానికుల నమ్మకం. ఈ పవిత్ర నీటి బుగ్గను 'బేజీ కలేర్' అని పిలుస్తారు. ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ నీటిలో ముఖం శుభ్రం చేసుకుని.. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆ నీటిని త్రాగాలి.

7 / 9
తనహ్ లాట్‌లో పియోదలం లేదా పూజవాలి అని పిలువబడే ఒక పెద్ద వేడుక ప్రతి 210 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఇది కునింగన్ దినోత్సవం తర్వాత 4వ రోజుల్లో ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతుంది.

8 / 9
బాలి వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సంక్షేమం, భద్రత కోసం ప్రార్థనలు చేస్తారు. కునింగన్ అనేది గలుంగన్ వేడుక సమయంలో భూమిని సందర్శించిన తర్వాత పూర్వీకులు స్వర్గానికి తిరిగి చేరుకుంటారని నమ్మకం.

9 / 9
ఈ ఆలయం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆలయంగా చెక్కారు. అనేకాదు ఈ తనాహ్ లాట్ ఆలయం చుట్టూ ఎనిమిది దేవాలయాలున్నాయి. ఈ ఆలయంలో పురాతన విలువైన సంపద ఉందని.. ఆ సంపదను సురక్షితంగా ఉంచడానికి  కంటికి కనిపించని విష సర్పాలు కావాలా ఉంటాయని నమ్మకం. ఇక్కడ ఉన్న వస్తువులను ఎవరైనా దొంగిలించాలని చూస్తే కంటికి కనిపించని విష సర్పాలు కాటు వేసి చంపుతాయని స్థానికులు చెబుతారు.