
మేషం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవి అనుకూల సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం సఫలమవుతాయి. ఆశించిన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి కూడా అవకాశముంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

వృషభం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన రవి అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. తండ్రి నుంచి ఆస్తి లభిస్తుంది. ఆస్తిపాస్తుల సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. గృహ యోగం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి అనుకూల సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడంతో పాటు ధన లాభాలు కలుగుతాయి. పితృమూలక ధన లాభం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది.

సింహం: రాశ్యధిపతి రవి మిత్ర క్షేత్రాలు, స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల జీవితం రాజయోగాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అగ్రస్థానంలో నిలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. ఆదాయానికి లోటుండదు.

వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతిగా అత్యంత శుభుడైన రవి అనుకూలత వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అధికార యోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్నవారైనా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది.

ధనుస్సు: ఈ రాశివారికి భాగ్య స్థానాధిపతిగా అత్యంత శుభుడైన రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, జూదాలు, లాటరీలు, ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీ సంపాదనను అనుభవించడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి కూడా ఆస్తి లాభం కలుగుతుంది.