
మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థంలోనూ, రవి సప్తమ స్థానంలోనూ నీచబడడం జరుగుతోంది. అయితే, కేంద్ర స్థితి వల్ల ఈ రెండు గ్రహాలకు నీచభంగం జరిగినందువల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజ యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించడంతో పాటు ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో రవి, పంచమ స్థానంలో రవి నీచబడడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా ఆశించిన ఫలితాలనిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకోకుండా పిత్రార్జితం లభించే సూచనలున్నాయి.

కర్కాటకం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడికి, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న రవికి నీచభంగం జరి గినందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అరుదైన ఆఫర్లు అందుతాయి. ఉద్యో గంలో బాగా రాణించడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

తుల: ఈ రాశిలో రవి, దశమ కేంద్రంలో కుజుడు నీచబడడం వల్ల అనేక విధాలైన ఆర్థిక లాభాలు కలుగు తాయి. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా అంచనాల్ని మించిన ఫలితాలనిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికార లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకా శాలు కూడా అందుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

వృశ్చికం: భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడు, వ్యయ స్థానంలో దశమాధిపతి రవి నీచబడడం వల్ల ఉద్యో గులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వమూలక ధన లాభా నికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. ప్రయాణాల వల్ల లాభముంటుంది. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.

మకరం: ఈ రాశికి సప్తమంలో కుజుడు, దశమ స్థానంలో రవి నీచబడినప్పటికీ, కేంద్ర స్థితి వల్ల ఈ రెండు గ్రహాలకూ నీచభంగం కలిగింది. దీనివల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభి స్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది.