
చాలామంది గుజరాత్ కి వెళ్తారు. అక్కడ ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ ఆలయాన్ని దర్శించుకుని వచ్చేస్తారు. అయితే తీరప్రాంత ఆధ్యాత్మిక స్వర్గధామం గుజరాత్ లో యాత్రికులు, పర్యాటకులు సందర్శించేందుకు అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. అవును ఈ రోజు రాష్ట్రంలోని సముద్ర తీరంలో ఉన్న ఆ ఐదు ఆలయాలు ఏమిటి? ఏ సమయంలో సందర్శించాలి తెలుసుకుందాం..

నీలకంఠధామ స్వామినారాయణ ఆలయం స్వామినారాయణుడికి అంకితం చేయబడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆలయం. దీని నిర్మాణం ఒక అద్భుతం. ఈ ఆలయ సముదాయం అనేక ఎకరాలలో విస్తరించి ఉంది. సముద్ర తీరంలో తోటలు, లైట్ షోలు, హారతులతో కూడిన దైవ దర్శనం భక్తులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. దీని నిర్మాణం, నిశ్శబ్ద వాతావరణం భక్తులకు విశ్రాంతి.. మానసిక ప్రశాంతతని ఇచ్చే ప్రదేశంగా చేశాయి. సందర్శకులు ఆలయ భోజనశాలలో ధ్యాన సెషన్లలో పాల్గొనవచ్చు. ఇక్కడ అందించే శాఖాహార భోజనాలను ఆస్వాదించవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి..ఆలయం తెరచి ఉండే సమయం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు

శ్రీ ద్వారకాధీష్ ఆలయం: పటాన్ లోని శ్రీ ద్వారకాధీశ ఆలయం హిందువులకు ముఖ్యమైన నాలుగు తీర్థయాత్రలలో ఒకటి. శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం హిందూ పురాణాలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది కృష్ణుడి ఏలిన రాజ్యం అని నమ్ముతారు. ఈ ఆలయం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశీ భక్తులను కూడా ఆకర్షిస్తుంది. సాయంత్రం హారతి , జన్మాష్టమి వంటి పండుగ వేడుకలకు ప్రసిద్ధి చెందిన ద్వారకాధీశ ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి మార్చి వరకు. ఆలయం తెరచి ఉండే సమయం ఉదయం 6:30 నుంచి రాత్రి 9:30

శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం: గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న సోమ నాథ ఆలయం నిర్మాణ శైలి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాదు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొదటిది. ఇది గుజరాత్ పశ్చిమ తీరంలో ఉంది. ఈ ఆలయం అత్యంత అద్భుతమైన తీరప్రాంత దృశ్యాలను కలిగి ఉంది. ఇది భక్తులకు ఒక ముఖ్యమైన యాత్రా స్థలం. చరిత్ర, ఆధ్యాత్మిక వాతావరణం,అద్భుతమైన నిర్మాణం ప్రతి ఒక్కరూ చూడాల్సిన గమ్యస్థానంగా చేస్తాయి. ఈ ఆలయం సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఆలయం తెరచి ఉండే సమయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ.

సూర్య నారాయణ ఆలయం: వడోదరలోని సూర్య నారాయణ ఆలయం అత్యంత పురాతనమైనది. అద్భుతమైన నిర్మాణ శైలి కలిగిన ఆలయం. అంతేకాదు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. మంచి ఆరోగ్యం కోసం సూర్య నారాయణుడి ఆశీర్వాదం పొందడానికి ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని పర్యావరణం ప్రశాంతత.. దైవత్వాన్ని జోడిస్తుంది. వడోదరలోని అద్భుతమైన ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ.. స్వామిని దర్శించుకునే సమయం ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు

EME ఆలయం: వడోదరలోని EME ఆలయాన్ని దక్షిణామూర్తి ఆలయం అని కూడా పిలుస్తారు. భారత సైన్యం నిర్వహించే ఒక ప్రత్యేకమైన ఆలయం. భారత సైన్యంలోని ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కోర్ నిర్మించిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇది ఆధునిక జియోడెసిక్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కళ, ఆధ్యాత్మికత కలయిక దీనిని తప్పక సందర్శించాలి. ఈ ఆలయాలను సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే శీతాకాలం సమయంలో వాతావరణం దృశ్యాలు, సముద్ర తీర ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలల్లో అలలు మితంగా ఉండటం వల్ల అలల దృగ్విషయం బాగా కనిపిస్తుంది. కనుక ఈ ఆలయాన్ని చూడడం సులభం అవుతుంది.