
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో ప్రస్తుతం శుక్ర, కేతువులు సంచారం చేస్తున్నందువల్ల వీరికి ఈ ఏడాదంతా షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభించే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల మీద ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ప్రము ఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో నెల రోజుల్లోగా ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడం వల్ల బాగా లబ్ధి పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి కలిసి వస్తాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది.

మిథునం: ఈ రాశికి పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం వల్ల జీవితంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయపరంగానే కాక, ఉద్యోగ, వ్యాపారాలపరంగా కూడా కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వమూలక ధన లాభం, గుర్తింపు కలుగుతాయి. రాజీమార్గంలో ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమై విలువైన ఆస్తిపాస్తులు లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానం మీద కుజ, గురువుల దృష్టి వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లోనే కాక, ఉద్యోగ మార్పు ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి అనేక అవకాశాలు అందుతాయి. ఈ రాశికి చెందిన నిరుద్యోగులు విదేశీ ప్రయత్నాల్ని పెంచడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి సమస్యలు పరిష్కారమై భూలాభం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ గ్రహ సంచారం వల్ల ఆర్థికంగా ఊహించని అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు అందివస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. కొద్ది ప్రయత్నంతో విలువైన ఆస్తి లాభం కలుగుతుంది.

మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందు వల్ల ఏడాదిపాటు పాటు ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయత్నలోపానికి అవకాశం ఇవ్వకపోవడం మంచిది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా కొద్ది ప్రయత్నంతో తప్పకుండా విదేశీ అవకాశాలు లభిస్తాయి. అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ అవకాశాన్నీ జారవిడుచుకోవద్దు.