సీతమ్మ తల్లికి గోరింటాకుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాల్సిందే!

Updated on: Mar 20, 2026 | 3:15 PM

శ్రీరామన నవమి వచ్చేస్తుంది. ఈరోజున శ్రీ సీతారాముల వారిని పూజించడమే కాకుండా, అంగరంగా వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామ నవమి రోజు రాముల వారిని పూజించిన వారికి కష్టాలు ఉండవు, ముఖ్యంగా దంపతులు పూజిస్తే వారి దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగుతుందని చెబుతారు.అయితే శ్రీరామ నవమికి ఒక రోజు ముందు అశోకాష్టమిని జరుపుకుంటారు. ఈరోజున గోరింటాకు చెట్టును పూజించడం చాలా మంచిదంట. దీని వలన విశేష ప్రయోజనాలు కలగుతాయిని చెబుతున్నారు పండితులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
సీతమ్మ తల్లికి , గోరింటాకు చెట్టుకు మంచి అనుబంధం ఉన్నదంట. శ్రీరామ నవమికి ఒకరోజు  ముందు గోరింటాకు చెట్టును మహిళలు పూజించడం వలన వారు కోరిన కోర్కెలు తీరడమే కాకుండా, వైవాహిక జీవితంలోని సమస్యలు తొలిగిపోయి, సుమంగళిగా ఉంటారంట. అంతే కాకుండా ఈ రోజు గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు.

2 / 5
రామాయణంలో సీతమ్మ తల్లిని   రావణుడు ఎత్తుకెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. ఆ సమయంలో సీతమ్మ తల్లి చాలా బాధపడితే అశోక వనంలోని గోరింటాకు చెట్లు అమ్మవారిని ఓదార్చి, నీకు అంతా మంచే జరుగుతుందని విశ్వాసాన్ని ఆమెలో నింపాయంట. అంతే కాకుండా, సీతమ్మ తల్లికి గోరింటాకు చెట్లు తమ ఆకును రాల్చి , అమ్మవారికి మంచంలా సహాయపడ్డాయంట. అంతే కాకుండా అమ్మవారు కూడా ఆ చెట్లను పూజించేదంట. ఇక రాముడు రావణుడిని చంపి, సీతను తీసుకెళ్లే సమయంలో సీమ్మ తల్లి గోరింటాకు చెట్టుకు వరం ఇచ్చిందంట.

3 / 5
 మీకు ఏం కావాలో కోరుకో అన్నప్పుడు, గోరింటాకు చెట్లు, తమను ఆడవారు ఎప్పుడూ తన చేతులకు ధరించాలి, నా రంగు వారి చేతికి పండి, వారు ఆనందంగా , సౌభ్యంగా ఉండేలా వరమివ్వమన్నదంట. అప్పటి నుంచి ఆడవారు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.  అంతే కాకుండా, ఆ చెట్లను పూజించడం  వలన సీతమ్మ తల్లికి మంచి జరిగిందని చెబుతుంటారు. అందుకే శ్రీరామ నవమికి  ముందు గోరింటాకు చెట్లను పూజించాలంట.

4 / 5
శ్రీరామ నవమికి ముందు అశోకాష్టమిన గోరింటాకు చెట్టును మహిళలు పూజించడం చాలా మంచిదంట. ముఖ్యంగా ఆరోజున వారు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వలన ఎలాంటి సమస్యలు ఉండవని, వైవాహిక జీవితంలో సమస్యలు తొలిగిపోతాయని, కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుందని వారు చెబుతున్నారు.అంతే కాకుండా ఈరోజు మహిళలు తమ రెండు చేతులకు గోరింటాకు పెట్టుకొని, దానికి నీరు పోసి, ఆ చెట్టును అందంగా అలంకరించి , పూలతో పూజించడం చాలా శుభప్రదం. అంతే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా గోరింటాకు పెట్టుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us