Kuja Dosha Nivarana Tips: మీకు కుజ దోషం ఉందా.? ఇంటిలో ఈ పరిహారాలతో తగ్గుముఖం..

Updated on: Jul 01, 2025 | 7:40 AM

కుజ దోషం అనేది జాతకంలో కుజుని అనుకూలమైన స్థానంలో లేకపోవడం వల్ల వచ్చే ఒక జ్యోతిష్య సమస్య. దీనివల్ల వివాహం, సంతానం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుజ దోషం ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అనేక పరిహారాలు ఉన్నాయి. అయితే ఇంటిలో చేసుకోగల సులభమైన పరిహారాలను ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి..  

1 / 5
కుజ దోషం నివారణకు అనేక పద్ధతులు ఉన్నాయి. జ్యోతిష్య నిపుణుల సలహాతో పూజలు, హోమాలు చేయించుకోవడం ఒక ప్రధానమైన పద్ధతి. అయితే, ఇంటిలోనే చేసుకోగల సులభమైన పరిహారాలు కూడా ఉన్నాయి.

2 / 5
ప్రతి మంగళవారం నవగ్రహాల ఆలయంలో ఏడు ప్రదక్షిణలు చేయడం, "ఓం అంగారకాయనమః" లేదా ఇతర కుజ మంత్రాలను పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను దర్శించడం, ఎర్రని పుష్పాలతో పూజలు చేయడం, ఆవులకు కందులు, తోటకూర, బెల్లం వంటివి ఇవ్వడం వంటివి చేయవచ్చు.

3 / 5
కుజ దోషం ఉన్నవారు రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా చాలా శుభప్రదం. ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా కుజ దోష నివారణకు ప్రసిద్ధి చెందినవి.

4 / 5
ఇంకా, కుజ గాయత్రి మంత్రం "ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్" లేదా ఆంజనేయ గాయత్రి మంత్రం "అంజనేయ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్" పారాయణ చేయడం ద్వారా కూడా కుజ దోషం యొక్క ప్రభావం తగ్గుతుంది. ఈ మంత్రాలను పొద్దున్నే 108 సార్లు పారాయణ చేయడం మంచిది.

5 / 5
కుజోహార సమయంలో సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేయడం కూడా ఉపయోగకరం. అయితే, ఈ పరిహారాలు చేయడం వల్ల కుజ దోషం పూర్తిగా తొలగిపోతుందని హామీ ఇవ్వలేము. ఇవి కేవలం దోషం ప్రభావం తగ్గించడానికి సహాయపడతాయి. ఏదైనా జ్యోతిష్య సంబంధిత సమస్యలకు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.