
మేషం: ఈ రాశికి సప్తమంలో స్వస్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. ఈ యోగం ఇక పూర్తి ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఈ యోగం వల్ల సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కలిగిన మాలవ్య మహా పురుష యోగం పూర్తి ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటు సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు ధన స్థానంలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన ధాన్య సమృద్ధికి బాగా అవకాశం ఉంది. కుటుంబ జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. అధికారులు ఈ రాశివారి సలహాలు, సూచనలతో బాగా లబ్ధి పొందు తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

తుల: ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా పెరిగి, సంపన్నుడి స్థాయికి చేరుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం పడుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి శుక్రుడి సంచారం వల్ల అతి తక్కువ శ్రమతో అత్యధికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతో పాటు జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడి స్థితి వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరిగి కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.