
2026లో శని గ్రహం మీనరాశిలోకి సంచారం చేయనుంది. ఈ సంవత్సరం మొత్తం శనీశ్వరుడు ఇదే రాశులో ఉండనున్నాడు. ఈ క్రమంలోనే శని గ్రహం కొందరికి చెడు ఫలితాలను ఇస్తే కొంత మందికి మాత్రం అదృష్టాన్ని కలిగించనున్నాడు. మరి శని మీన రాశిలోకి సంచారం వలన ఏ రాశుల వారికి లక్కు కలిసి వస్తుందంటే?

వృషభ రాశి : శని మీన రాశిలోకి సంచారం చేయడం వలన వృషభ రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. వీరికి అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి అవుతాయి. కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అన్నిరంగాల్లో మంచి పురోగతి ఉంటుంది. వృత్తి , ఉద్యోగాల్లో ఊహించని విధంగా వృద్ధి కనిపిస్తుంది. దీంతో వీరు చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి శని సంచారం చాలా అద్భుతమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఈ రాశి వారు విదేశీ యాత్రలు చేస్తారు. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సాధిస్తారు. అంతే కాకుండా, నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విందు, వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.

కన్యా రాశి : కన్యారాశి వారికి మీనరాశిలోకి శని సంచారం వలన వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

తుల రాశి : తుల రాశి వారికి శని సంచారం వలన ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. కెరీర్ బాగుంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలమిస్తాయి. ఆర్థిక సమస్యలు తొలిగిపోయి చాలా ఆనందంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయం మొత్తం ఈ రాశుల వారు చాలా ఆనందంగా గడుపుతారు.