
ప్రతి సంవత్సరం మే 25న రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో తీవ్రమైన ఎండ ఉంటుంది. ఇక రోహిణి కార్తె అంటే, సూర్యుడు ప్రతి 13 రోజులకు ఒక నక్షత్రంలో సంచారం చేస్తాడు. అయితే రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు సంచరించే సమయాన్ని రోహిణి కార్తె అంటారు. ఈ సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటమే కాకుండా, అగ్నిప్రమాదాలు కూడా ఇప్పుడే ఎక్కువగా జరుగుతుంటాయి.

ఇక ఈ రోహిణి కార్తె అనేది జూన్ 8 వరకు ఉంటుంది. తర్వాత మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. మృగశిర కార్తె అనేది వర్షాకాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఆకాశం మొత్తం మబ్బులతో నిండి, చల్లటి వాతావరణం ఉంటుంది. వేసవి ముగిసిపోయి వర్షాకాల ప్రారంభమయ్యే సమయం ఈ మృగశిర కార్తె. దీని తర్వాత వర్షాకాలం ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఎక్కువగా విత్తనాలు నాటడం వంటివి చేస్తుంటారు.

ఇక రోహిణి కార్తె వచ్చిన సమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఉంటాయి అంటారు పెద్దవారు. మరి అసలు ఈ కార్తెలో రోళ్లు పగిలే అంత ఎండలు ఎందుకు కొడతాయి అంటారో తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో సూర్యుడు మన నెత్తిమీదకు అంటే మాడు మీదకు వస్తాడంట. ఈ కార్తె మొత్తం చాలా ఉగ్రరూపంలో ఉంటాడు అని చెబుతుంటారు పండితులు. సూర్యుడి ఉగ్రరూపం భూమి తట్టుకోలేదంట. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ 15 రోజుల పాటు తీవ్రమైన ఎండ , వేడి గాలులు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయంట. సూర్యుడు అచ్చం అగ్నిగోళంలా ఉంటాడని చెబుతున్నారు నిపుణులు.

సూర్యుడి ఉగ్రరూపంలోకి మారిపోయి నిప్పులు కక్కుతాడంట దీంతో సూర్యుని కిరణాలు భూమిపై పడగానే తేమ మొత్తం హరించుకపోతుందంట. అంతే కాకుండా ఈ సమయంలో రాళ్లు, రోళ్లు కూడా పగులు ఏర్పడుతాయంట. అంటే అంత ఎండ ఉంటుందంట. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఎక్కువగా బయటకు రాకూడదని, సాయంత్రం అయితే తప్ప బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంటారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)