
భారీ రాజగోపాలు, అతి పురాతన దేవాలయాలపై కలశాలు ఏర్పాటు చేస్తారు.. ఎందుకో తెలుసా..!శాస్త్ర ప్రకారం ఏర్పాటు చేసే ఆ రాతి కళాశాల వెనుక అత్యంత ప్రాధాన్యత కలిగిన శాస్త్రీయత ఉంది.. పిడుగుల ముప్పు నుండి ఆ ఆలయాలను పరిరక్షించడం కోసం రాతి కళాశాలను గోపురాల పైన ప్రతిష్టిస్తారు. కాకతీయుల నిర్మాణాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో యూనెస్కో గుర్తింపుపొందిన రామప్ప గుడి ఒకటి, వేయి స్తంభాల గుడి, కిలా వరంగల్ లోని అపురూప శిల్పసంపద మనసును అట్టే కట్టిపడేస్తాయి

సుమారు తొమ్మిది వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ వారసత్వ సంపద ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని నిలబడ్డాయి.. దుండగులు ధ్వంసం చేయగా మిగిలిన శిల్పసంపద నేటికి సజీవంగా నిలబడ్డాయి.. సాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప, వేయి స్తంభాల గుడి వెయ్యేళ్ళ క్రితమే కాకతీయులు ఎంతటి ఎంతటి మేదో సంపత్తితో నిర్మాణాలు చేపట్టారో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. దేశమంతా సగర్వంగా బావించే ఈ చారిత్రక నిర్మాణాలన్నీ కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి.. ఐతే ప్రకృతి విపత్తులు, ముఖ్యంగా పిడుగుల బెడద నుండి వీటి రక్షణకు మరో అడుగుపడింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే ప్రయత్నాల్లో చేస్తోంది కేంద్ర పురావస్తు శాఖ.. రామప్ప ఆలయంతో పాటు చుట్టూ 150 మీటర్ల వరకు పిడుగులు పడకుండా టెంపుల్ ను పిడుగుల బారి నుంచి కాపాడం కోసం ఆధునిక టెక్నాలజీతో లైటింగ్ అరెస్టింగ్ టవర్ నిర్మాణం చేపట్టారు.

రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత దేశ విదేశీ సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరిగింది.. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచే రామప్ప వందల ఏళ్లనాటి చరిత్ర. ఎన్నో దాడులు. ప్రకృతి వైపరీత్యాలు... నిర్లక్ష్యం లాంటి మాన తప్పిదాలను తట్టుకుని నిలబడింది..ఈ క్రమంలోనే రామప్ప ఆలయ అభివృద్ది... భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెంపుల్.. పరిసర ప్రాంతాలను పూర్తిగా సీసీ కెమెరాల పరిధిలోకి తీసుకువచ్చారు. ఇటీవల రామప్ప ఉప ఆలయాల్లో గొల్లాల గుడి, శివాలయాలను జాతీయ స్మారక చిహ్నాలుగా గుర్తించి, వాటిని కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంది.

ఉపాలయాల రక్షణకు కంచె పనులు మొదలయ్యాయి. ఇదే క్రమంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే ప్రయత్నాలు చేపట్టారు..రామప్ప ఆలయంతో పాటు చుట్టూ 150 మీటర్ల వరకు పిడుగులు పడకుండా పురావస్తు శాఖ చర్యలకు పూనుకుంది. అందుకోసం 21 మీటర్ల పొడవైన టవర్ ను రామప్ప గార్డెన్లో ఏర్పాటు చేశారు. ఈ టవర్ కు పైభాగం వరకు సుమారు 3.25 ఎంఎం సైజ్ కాపర్ వైర్ ను బిగించిన ప్రత్యేక పరికరం ఏర్పాటు చేశారు.. దీంతోపాటు పిడుగుల నుండి పూర్తి భద్రత కల్పించడంతో పాటు ఎన్నిసార్లు పిడుగులు పడ్డాయో సంఖ్యను కనిపెట్టే పరికరాన్ని అమర్చారు.ఈ టవర్స్ పిడుగుల శక్తిని భూమిలోకి పంపి, ఈ నిర్మాణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చుట్టూ 150 మీటర్ల వరకు పిడుగులు పడకుండా నిలువరించే సామర్థ్యంతో పరి కరాన్ని ఏర్పాటు చేయడంతో పిడుగుపడ్డ ఆలయానికి ఆలయ సమీపంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా పురావస్తు శాఖ ఈ టవర్ ను ఏర్పాటు చేస్తోంది.

రామప్పతో పాటు అంతే ప్రత్యేకత కలిగిన వేయిస్తంభాల గుడి, కిలా వరంగల్ లో కూడా లైటనింగ్ అరెస్టర్లను ఏర్పాటుచేశారు.. ఐతే గతంలో పిడుగులు, భూకంపాలతో అనేక ప్రమాదాలు సంభవించాయి.. వేయి స్తంభాల గుడి కళ్యాణ మండపం, రామప్ప ముఖద్వారం పిడుగుల ప్రభావం విరిగిపడ్డాయి.. తాజాగా పురావస్తుశాఖ ఏర్పాటు చేస్తున్న లేట్నింగ్ అరెస్టింగ్ టవర్స్ వల్ల సత్ఫలితాలు ఉంటాయని పూజారులు అంటున్నారు .వందల ఏళ్ళు గడిచినా చెక్కు చెదరని ఈ వారసత్వ సంపద మన దేశ పర్యాటక ముఖ చిత్రాణికి కంఠాభరణంలా నిలిచాయి.. వీటిని సజీవంగా నిలిపి భావితరాలకు అందించే ప్రయత్నమే ఇలాంటి నిర్మాణాలు... వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.