
త్వరలో జనవరి నెల రాబోతుంది, కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అయితే 2026లో రాహు గ్రహం రెండు సార్లు తమ గమనాన్ని మార్చుకోబోతుంది. ఆగస్టు నెలలో కుంభ రాశిలో ఉంటూ ధనిష్ట నక్షత్రంలోకి సంచారం, చేస్తుంది. తర్వాత డిసెంబర్ నెలలో మకర రాశిలోకి సంచారం చేస్తుంది. దీని వలన కొన్ని రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది. కెరీర్ పరంగా స్వల్ప అడ్డంకులు ఎదురు అవుతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. కోర్టు సంబంధ వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరకడం కష్టమే, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం, ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి.

మేష రాశి : మేష రాశి వారికి 2026లో రాహు గ్రహం కదలికల వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయి. ఆదాయం తగ్గిపోవడంతో మానసిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకుంటుంది. వ్యాపారంలో కూడా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చాలా కష్టంగా నడుస్తుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి రాహు గ్రహం ప్రభావం వలన ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆదాయం తగ్గిపోతుంది. ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతాయి. ఏ పని ప్రారంభించినా, అది మధ్యలోనే ఆగిపోతుంది. ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో, ప్రయాణాల సమయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనస్సు రాశి : ధనస్సురాశి వారికి మానసిక చికాకులు అధికం అవుతాయి. వైవాహిక బంధంలో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో కూడా ఆశించిన ఫలితాలు రావు, వివాదాల్లో చిక్కు కుంటారు. ఆరోగ్యం దెబ్బతినడంతో చాలా ఇబ్బందులు పడుతారు. విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప మంచి ఫలితం అందుకోలేరు.