అక్టోబర్ లో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నాయి. ఈ మార్పుల వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సంచలనాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇందులో బుధుడు అక్టోబర్ 10న, శుక్రుడు 15న, రవి 16న, కుజుడు 21న రాశులు మారడం జరుగుతోంది. ఈ నాలుగు గ్రహాల మార్పు బాగా అనుకూలంగా ఉండే రాశులు మేషం, మిథునం, కన్య, ధనుస్సు, మకరం, కుంభం. ఉద్యోగంలో ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకోవడం, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం, అనుకోకుండా జీత భత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.