
బెంగళూరులోని గరుడ మాల్ ప్రత్యేకంగా దసరా బొమ్మల పండుగను నిర్వహిస్తోంది. ఈ బొమ్మల పండుగ అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 13 వరకు జరగనుంది. శాండల్‌వుడ్ నటి అమృత అయ్యంగార్ ఈ బొమ్మల ప్రదర్శనను ప్రారంభించారు.

బాల రామ జననం, శ్రీరాముడు సీత కోసం ఇంద్ర ధనుస్సును విరచడం, సీత స్వావలంబన, రామ-లక్ష్మణ-సీతలు తండ్రికి ఇచ్చిన మాట కారణంగా వనవాసానికి వెళ్లడం, సీతను అడవిలో అపహరించడం, రామ-రావణ యుద్ధం. ఇలా మొత్తం రామాయణాన్ని బొమ్మల్లో అద్భుతంగా ప్రదర్శించారు.

గతేడాది కూడా దసరా మహోత్సవాల సందర్భంగా మహాభారతం నేపథ్యంతో తయారు చేసిన బొమ్మల ప్రదర్శన గిన్నిస్ రికార్డు సృష్టించింది.

ఈ ఏడాది రామాయణం ఇతివృత్తంగా తోలుబొమ్మలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. ఈ బొమ్మల కొలువు కోసం ఏర్పాటు చేసిన బొమ్మలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన 28 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు తయారు చేశారు. ఈ బొమ్మల కొలువులో రామాయణ ఇతి వృత్తంగా 1200కు పైగా తోలుబొమ్మలను రూపొందించారు.

అంతే కాదు షాపింగ్ మాల్ బయట దసరా అంబారీ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. దసరా, రామాయణ దృశ్యాలు ప్రజలకు కనువిందు చేస్తున్నాయి. రామాయణ స్వరూపాన్ని ప్రజలకు పంచుతాయి.

కర్ణాటకలో మైసూర్‌లో చారిత్రాత్మక దసరా వైభవంగా జరుపుకుంటుంటే.. మరోవైపు ఆధునికత జోడిస్తూ గరుడ మాల్‌లో నవరాత్రులను భిన్నంగా బొమ్మల కొలువు పద్ధతిలో జరుపుకుంటున్నారు. ప్రజలు బెంగళూరుకి వెళ్తే.. ఈ షాపింగ్ మాల్ లోని రామాయణ దృశ్యాలను మిస్ చేసుకోకుండా చూడవచ్చు.