ప్రకృతి అందానికి పుట్టిల్లు నల్లమల అడవులు.. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, జలపాతాలు గురించి తెలుసా

|

Dec 16, 2024 | 9:23 PM

తూర్పు కనుమల్లో ఒక భాగంగా ఉన్న నల్లమల అడవులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో పులులు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ నల్లమల అడవులు ఉన్న ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. అంతేకాదు ఈ అడవులు ప్రకృతి అందాలకు మాత్రమే కాదు ఆధ్యాత్మిక క్షేత్రాలకు కూడా నెలవు. అడవుల్లో దాగున్న ఆలయాల్లోకి వెళ్ళాలంటే.. ట్రెక్కింగ్ చేసుకుంటూ.. కొండలు, గుట్టలు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ప్రకృతిలోకి మానవ ప్రయాణం అనిపిస్తుంది. ఈ రోజు అందమైన ప్రదేశాల గురించి తెల్సుకుందాం..

1 / 6
సలేశ్వరం: నల్లమల అడవుల్లోని సలేశ్వర క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొండల్లో శివుడు కొలువై పూజలను అందుకుంటాడు. ఇక్కడ ఆకాశ గంగ ను తలపించే గొప్ప జలపాతం ఉంది. ఈ జలపాతం వేసవిలో చల్లగా ఉంటుంది.

2 / 6
ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి: అహోబిలం దగ్గర ఉన్న ఉల్లెడ క్షేత్రంలో ఉమామహేశ్వరుడు లింగమయ్య రూపంలో కొలువై ఉన్నాడు. భక్తులతో పూజలందుకొంటున్నాడు. ఇది తెలుగు వారి అమర్‌నాథ్ క్షేత్రం అని భావిస్తారు. మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు భావిస్తారు. అడవుల్లో కాలి నడకన సెలయేళ్ళు దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంది. సాహసం చేస్తూ వేల్తేకానీ స్వామి దర్శనం అవ్వదు.

3 / 6
గవి మల్లేశ్వరుడు: నల్లమల కొండల్లో ఉన్న  బ్రహ్మంగారి మఠం కి కొంచెం దూరంగా వెళ్తే.. సుమారు 100 వరకు ఉన్న గుహలు కనిపిస్తాయి. ఈ గుహాల్లో శివుడు గవి మల్లేశ్వరుని గా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. పూజలను అందుకుంటున్నాడు

4 / 6
రంగనాథ స్వామి ఆలయం: నల్లమల దట్టమైన అడవుల్లో ఉన్న ఆలయం రంగనాథ స్వామి ఆలయం. వారంలో శనివారం మాత్రమే తెరచి ఉంటుంది. అది కూడా సాయంత్రం  6 అయితే క్లోక్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఓ జలపాతం  గుండ్లకమ్మనది పై నుంచి కిందకు పడుతుంటుంది. ఏడాదంతా నీటి సవ్వడులతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

5 / 6
నెమలిగుండం: ప్రకృతి అందాలను ఇష్టపదేవారికి సందర్శనీయ ప్రదేశం నెమలిగుండం. నల్లమల్ల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారి నెమలిగుండంలోకి చేరుతున్న జలపాతాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు.

6 / 6
కొలనుభారతి: నల్లమల అడవుల్లో మరో క్షేత్రం కొలనుభారతి. ఇక్కడి ప్రధాన దైవం సరస్వతి దేవి. దగ్గరలోనే సప్త శివాలయాలు కూడా భక్తులకు సందర్శనీయం.