Most Visited Places in India: మనదేశంలోని ఈ ప్రముఖ ప్రదేశాలను తక్కువ ఖర్చుతో చూడవచ్చు.. వివరాల్లోకి వెళ్తే..!
ఎప్పుడు ఒకే ప్లేస్ లో ఉంటే జీవితం బోర్ కొడుతుంది. అందుకనే మనవాళ్ళు తీర్ధయాత్రలు అంటూ.. వివిధ ప్రదేశాలకు వెళ్లే సంప్రదాయాన్ని ఏర్పరచారు. అయితే కొత్త ప్రదేశాలకు వెళ్తే.. ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని చాలా మంది భావిస్తుంటారు. భారతదేశంలో తక్కువ ఖర్చుతో సందర్శించే ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం..!
Varanasi
Follow us on
హిందువుల ప్రముఖ ఆధ్యాత్మక క్షేత్రం కాశీ లేదా వారణాసి. ఇది భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. ఈ వారణాసి ను చూడడానికి గంగలో స్నానమాచరించడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. గంగా నది, దేవాలయాలు ఇలా చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి.
రిషికేశ్ హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార కర్మలాచరించినట్లు పురాణ కథనం. ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. తప్పక చూడాల్సిన ప్రదేశం. గంగా నది లో రివర్ రాఫ్టింగ్ చాలా బాగుంటుంది. ఢిల్లీకి ఇది కేవలం 229 కిలోమీటర్ల దూరం మాత్రమే. బస్సు సదుపాయం కూడా ఉంది.
హిల్ స్టేషన్స్ లో గడపాలి అనుకునేవారికి బెస్ట్ ప్లేసెస్.. కసౌలి , లాన్స్ డౌన్ లు.. ఈ ప్రాంతాలు అందమైన హిల్ స్టేషన్స్. ఢిల్లీ నుంచి సులువుగా రైలులో వెళ్లొచ్చు. ఐదు వేల రూపాయల కంటే తక్కువ ఖర్చుతో మీరు ఈ ప్రదేశాన్ని చూడొచ్చు.
కృష్ణ భగవానుడు తన చిన్ననాటి రోజులను గడిపిన ప్రదేశములలో ఒకటి మధుర జిల్లాలోని బృందావన్. ప్రతి హిందువు ఈ ప్రదేశాన్ని తప్పని సరిగా చూడాలి.. పైగా తక్కువ ఖర్చు కూడా. ఆధ్యాత్మికతతో ఈ ప్రదేశమంతా నిండి ఉంటుంది. ఫోటోగ్రఫీ ఇష్టమైనవారికి అనువైన ప్రాంతం బృందావనం
ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం. మూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ సూర్యోదయాన్ని చూడడానికి పర్యాటకులు ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇది త్రివేండ్రం నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.