
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర, రాహువులు కలవడం వల్ల ఈ రాశివారు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వీరు షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల వీరికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో చంద్ర, రాహువులు కలవడం వల్ల మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలను, ఆశలను తీర్చుకునేందుకు ఈ రాశివారు తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతుంది. సరి కొత్త ఉద్యోగ అవకాశాల కోసం, ఆదాయాన్ని వృద్ధి చేసుకునే మార్గాల కోసం వీరు గట్టిగా, అవిశ్రాంతంగా ప్రయత్నించే అవకాశం ఉంది. వీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతగా అవకాశాలు కలిసి వస్తాయి. వీరి ప్రయత్నాల వల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.

మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర, రాహువుల యుతి వల్ల ఈ రాశివారిలో యాంబిషన్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ, వీరు ఇతర సంస్థల్లో లేదా విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం గట్టిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. మరింతగా ఆదాయ వృద్ధికి వీరు షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి లబ్ది పొందడం జరుగుతుంది. వీరికి తప్పకుండా అదనపు అవకాశాలు లభిస్తాయి.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర, రాహువుల కలయిక వల్ల ఈ రాశివారిలో ఆశలు, కోరికలు విజృంభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవుల కోసం వీరు రకరకాలుగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఇతర సంస్థల్లో తమకు అనుకూలమైన పదవుల కోసం గట్టి ప్రయత్నాలు సాగి స్తారు. విదేశీ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించడం జరుగుతుంది. తమ నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాల్ని బాగా మెరుగుపరచుకుంటారు. వీరి ప్రయత్నాలు తప్పకుండా ఫలించే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్ర, రాహువుల యుతి వల్ల ఈ రాశివారికి ఆస్తిపాస్తులను పెంచుకోవడం మీదా, గృహ లాభం పొందడం మీదా దృష్టి కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. వీరు ఇప్పటికే ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పటికీ, మరిన్ని ఆస్తులను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకుని విలువైన ఆస్తిని పొందుతారు. ఆదాయ వృద్ధి మార్గాల్ని పెంచుకుంటారు. ముఖ్యంగా షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు గడిస్తారు.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో చంద్ర రాహువుల కలయిక వల్ల ఈ రాశివారు బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు సాగిస్తారు. ఎటువంటి ఆదాయ వృద్ధి అవకాశాన్నీ జారవిడుచుకోరు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతున్నా, వీరు సంపద వృద్ధి కోసం అనేక మార్గాల్ని అనుసరించే అవకాశం ఉంది. వీరి ప్రయత్నాలకు తగ్గట్టుగా ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం, రావలసిన సొమ్ము చేతికి అందడం జరుగుతుంది.