మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శని, గురు, బుధ, రవి గ్రహాల వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ధన, లాభ స్థానాల బలం వల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందు తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ఆలోచనలు చేస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత పదవులకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలి తాలనిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విద్యార్థులు శ్రమను పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. తరచూ స్కంద స్తోత్ర పఠనం చాలా మంచిది.