
మిథునం: రాశ్యధిపతి బుధుడికి, శుక్రుడికి పరివర్తన జరగడం వల్ల ధనధాన్య సమృద్ధి యోగం కలిగింది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఘన విజయాలు సాధిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు అంచనాలను మించిన లాభాలనిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా దూసుకుపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి తృతీయ, చతుర్థ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల అనుకోకుండా శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అంచనాలకు మించి జీతాలు, ఆదాయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.

సింహం: ఈ రాశికి ధన, తృతీయాధిపతులైన బుధ, శుక్రుల మధ్య పరివర్తన చోటు చేసుకోవడం వల్ల తప్ప కుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. లాభదాయక ఒప్పందాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆస్తి లభి స్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడికి, ధన స్థానాధిపతి శుక్రుడికి పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో ప్రతిభకు, సమర్థతకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉన్నత పదవి లభించి జీత భత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయానికి అవకాశాలు లభిస్తాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు: ఈ రాశికి దశమ, లాభాధిపతులైన బుధ శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో తప్ప కుండా పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆస్తుల విలువ అంచనాలకు మించి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వారసత్వపు ఆస్తి లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి.

మకరం: ఈ రాశికి భాగ్య, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ధన యోగం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు ప్రాభవం కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల బాటపడతాయి. మాటకు బాగా విలువ పెరుగుతుంది.