Budh Blessings: బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..!

Edited By:

Updated on: Jul 25, 2026 | 5:22 PM

Mercury Turns Direct: జూలై 2 నుంచి 26 వరకు కర్కాటక రాశిలోనూ.. ఆ తర్వాత తన స్వక్షేత్రమైన మిథున రాశిలోనూ వక్రించి ఉన్న బుధ గ్రహం ఈ నెల 27 నుంచి రుజు మార్గంలో, అంటే సవ్య దిశలో సంచారం ప్రారంభించబోతోంది. ఆగస్టు 5 వరకు మిథున రాశిలో సవ్యంగా సంచారం చేస్తున్న బుధుడి వల్ల కొన్ని రాశులవారు సమస్యలు, వివాదాలు, విభేదాల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. తెలివితేటలకు, సమయస్ఫూర్తికి, వివేకానికి, విజ్ఞానానికి, బుద్ధికి కారకుడు, సమస్యల పరిష్కర్త అయిన బుధుడి వల్ల ఆదాయ వృద్ధికి అనుకూలతలు కలుగుతాయి. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారు బాగా లబ్ధి పొందుతారు.

1 / 6
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో బుధ సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో ఆదాయాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ముఖ్యమైన పెండింగ్ పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక, గృహ ఒప్పందాలు కుదర్చుకోవడానికి సమయం వీలుగా ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు స్వస్థానంలో ఉండడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలవంతం అవుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.

3 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి బుధుడి రుజు సంచారం వల్ల ఉద్యోగంలో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడా నికి అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు.

4 / 6
కన్య: ఈ రాశికి కూడా అధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో సంచారం వల్ల ఉద్యోగపరంగా మంచి అదృష్టం పడుతుంది. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశీయానానికి  ఆటంకాలు తొలగిపోతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

5 / 6
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడి రుజు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశా లకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి, ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి, రాబడి పెరగడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి.

6 / 6
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడి సవ్య దిశ సంచారం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు లాభాల పంట పండిస్తాయి. విదేశీయానానికి అవకాశాలు మెరుగుపడతాయి. మీ సలహాలు, సూచనల వల్ల ఉద్యోగంలో అధికారులే కాక, బంధుమిత్రులు కూడా బాగా లబ్ధి పొందుతారు. ఆదాయ వృద్ది ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి అవకాశముంది. ప్రేమ ప్రయత్నాల్లో కూడా విజయాలు సాధిస్తారు.

Follow Us