
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో బుధ సంచారం జరుగుతున్నంత కాలం ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగుతాయి. ప్రతి విషయంలోనూ ప్లానింగ్, దూరదృష్టితో వ్యవహరించడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టి లబ్ధి పొందుతారు. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాల్ని మించి లాభిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది.

వృషభం: ఈ రాశికి ధన, పంచమాధిపతిగా అత్యంత శుభుడైన బుధుడు దశమ స్థాన సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో వీరిచ్చే సలహాలు, సూచనల వల్ల సంస్థకు మేలు జరుగు తుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు, లాభాలు పొందుతారు. ఏ పని తలపెట్టినా సఫలమవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల బాటపడతాయి. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టం ఈ రాశి వారి తలుపు తడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిర పడిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా బాగా ఆర్జించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కనీవినీ ఎరుగని రీతిలో మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్ని కొద్ది మార్పులతో లాభాల బాట పట్టిస్తారు.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల పని చేస్తున్న సంస్థకు ఒక ఆస్తిగా మారడం జరుగుతుంది. నైపుణ్యాల్ని పెంచుకుంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో భాగ్యాధిపతి బుధుడి సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. లాభదాయక ఒప్పం దాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

కుంభం: ఈ రాశిలో బుధ సంచారం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.