Astrology: బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు-మనశ్శాంతిపై భారీ ప్రభావం!

Updated on: Jun 28, 2026 | 9:06 AM

Mercury Retrograde 2026: జూన్ 29 నుంచి జూలై 23 వరకు బుధుడు వక్రగతిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో మిథునం, ధనుస్సు, వృశ్చిక రాశుల వారికి ఆర్థిక ఒత్తిడి, మానసిక ఆందోళనలు, పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ 25 రోజులు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు జూన్ 29 నుంచి జూలై 23 వరకు వక్రగతిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో బుధుడు కర్కాటకం, మిథునం రాశుల్లో సంచరిస్తాడు. బుధుడు బుద్ధి, వ్యాపారం, సంభాషణ, ఆర్థిక వ్యవహారాలకు కారక గ్రహంగా భావిస్తారు. అందువల్ల ఈ వక్రగతి ప్రభావం కొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులను తీసుకురావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మిథునం, ధనుస్సు, వృశ్చికం  రాశుల వారు ఈ 25 రోజుల పాటు అప్రమత్తంగా ఉండటం మంచిది.

2 / 5
మిథున రాశి: బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ వక్రగతి ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు పెరిగి ఆర్థిక ప్రణాళికలు దెబ్బతినే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల్లో సంయమనం పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి వ్యవహరించడం మంచిది.

3 / 5
ధనుస్సు రాశి: ఈ సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవచ్చు. కాబట్టి ఖర్చులను నియంత్రించడంతో పాటు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

4 / 5
వృశ్చిక రాశి: బుధుని వక్రగతి కారణంగా కమ్యూనికేషన్‌కు సంబంధించిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీడియా, రచన, మార్కెటింగ్, సోషల్ మీడియా రంగాల్లో పనిచేసేవారు పనుల్లో ఆలస్యం లేదా అపార్థాలను ఎదుర్కోవచ్చు. ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం, మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం.

5 / 5
ఈ 25 రోజులు పాటించాల్సిన జాగ్రత్తలు: 
కొత్త వ్యాపారాలు లేదా పెద్ద పెట్టుబడులను ప్రారంభించడం వీలైతే వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఒప్పందాలు, ముఖ్యమైన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయండి. కోపం లేదా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించండి. సంభాషణల్లో స్పష్టత, సంయమనం పాటిస్తే అనవసర వివాదాలను నివారించవచ్చు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

ఈ 25 రోజులు పాటించాల్సిన జాగ్రత్తలు: కొత్త వ్యాపారాలు లేదా పెద్ద పెట్టుబడులను ప్రారంభించడం వీలైతే వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఒప్పందాలు, ముఖ్యమైన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయండి. కోపం లేదా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించండి. సంభాషణల్లో స్పష్టత, సంయమనం పాటిస్తే అనవసర వివాదాలను నివారించవచ్చు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us