
ఫిబ్రవరి నెలలో సూర్య గ్రహం, కుజ గ్రహం కలయిక ఏర్పడ బోతుంది. దీని వలన శక్తి వంతమైన మాంగల్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ప్రతికూల సమస్యలు ఎదుర అవుతే, మరికొన్ని రాశుల వారికి అదృష్టం తలపుతడుతుంది. కాగా ఈ రాజయోగం వలన ఎవరి దశ తిరగనుందో ఇప్పుడు చూద్దాం.

తుల రాశి : తుల రాశి వారికి మాంగల్య రాజయోగం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. కావు అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి అవుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

సింహ రాశి : సింహ రాశి వారి దశ తిరిగినట్లే. వీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పనుల్లో బాధ్యత పెరుగుతుంది. పదోన్నతలు అందుకుంటారు. సామాజిక కార్య క్రమాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు, ఇది మీకు లాభాలను తీసుకొస్తుంది.

మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహం, సూర్య గ్రహం సంయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ప్రతి పనిలో విజయం పొందుతారు. కెరీర్ పరంగా అద్భుతంగా రాణిస్తారు. ఈ రాశి వారు ఫిబ్రవరి నెలలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు. రాజకీయంగా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.