Lord Shiva Blessings: శివ రాత్రితో శని దోషం నుంచి ఆ రాశుల వారికి విముక్తి..!

Edited By:

Updated on: Feb 09, 2026 | 6:59 PM

Mahashivratri 2026: ఈ నెల (ఫిబ్రవరి) 15న వస్తున్న మహా శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. శనీశ్వరుడికి అధిష్ఠాన దేవత అయిన శివుడికి సంబంధించిన పర్వదినం అయినందువల్ల శివరాత్రి నాడు శివుడిని ఆరాధించే పక్షంలో శని దోషాలున్నవారికి ఆ దోషం చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దోషం ఉన్నవారు ఈ పర్వదినాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు రకరకాలలుగా శని దోషం కలిగింది. దీనివల్ల వీరు అష్టకష్టాలు పడడం జరుగుతోంది. ఈ రాశుల వారు శివరాత్రి నాడు శివుడిని భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ప్రార్థించే పక్షంలో ఈ దోషం నుంచి చాలావరకు విముక్తి చెందే అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని మొదటి దశ ప్రారంభం అయినందువల్ల వీరు తప్పనిసరిగా శివుడిని ప్రార్థించవలసి ఉంటుంది. మహాశివరాత్రి రోజున వీరు శివుడిని రుద్రాష్టకంతో అర్చించే పక్షంలో ఈ శని దోషం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు తగ్గడం, శ్రమ, తిప్పట నుంచి విముక్తి లభించడం, ఆదాయం పెరగడం, విదేశాల్లో ఉద్యోగం లభించడం, పెట్టుబడులకు తగ్గ లాభాలు లభించడం వంటివి జరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది.

2 / 6
సింహం: ఈ రాశికి అష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల ప్రతి పనీ ఆలస్యం కావడం, ఆదాయం పెరగక పోవడం, ఖర్చులు పెరగడం, ప్రతి ప్రయత్నంలోనూ అవరోధాలు ఏర్పడడం, వృత్తి, ఉద్యోగంలో ఒత్తిడి పెరగడం, రావలసిన సొమ్ము అందకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. శివరాత్రి నాడు శివుడిని బిల్వ పత్రాలతో అర్చించడం వల్ల జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. అనేక పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది.

3 / 6
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో పురోగతి స్తంభించిపోవడం, లాభాలు తగ్గడం, పదోన్నతులు ఆగిపోవడం, పెళ్లి ప్రయత్నాలు ఫలించకపోవడం, ప్రేమ వ్యవ హారాల్లో ఆటంకాలు ఏర్పడడం, ఉద్యోగం లభించకపోవడం, దుర్వార్తలు ఎక్కువగా వినడం వంటివి జరిగే అవకాశం ఉంది. శివరాత్రి రోజున శివార్చన చేయడం లేదా శివాష్టకం చదువుకోవడం వల్ల తప్పకుండా ఈ సమస్యల నుంచి బయటపడి, బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

4 / 6
ధనుస్సు: శని మీన రాశి ప్రవేశంతో ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది. దీనివల్ల ఏడాదిగా వీరికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గడం జరిగింది. పదోన్నతులు ఆగిపోవడం, ఆస్తి వివాదాలు పెరగడం, కుటుంబ సమస్యలు తలెత్తడం, సొంత ఇల్లు, వాహన ప్రయత్నాలకు ఆటం కాలు ఏర్పడడం జరుగుతోంది. శివరాత్రి రోజున శివుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో మళ్లీ ప్రాధాన్యం పెరగడంతో పాటు, ఇతర సమస్యలు కూడా సమసిపోతాయి.

5 / 6
కుంభం: ఈ రాశికి ప్రస్తుతం ఏలిన్నాటి శని చివరి దశ జరుగుతోంది. దీని వల్ల ఆదాయం పెరగకపోవడం, తక్కువ ఆదాయానికి ఎక్కువగా శ్రమపడడం, రావలసిన డబ్బు రాకపోవడం, సహాయం పొందిన వారు ముఖం చాటేయడం, జీతభత్యాలు పెరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహా శివ రాత్రి నాడు శివుడిని నియమ నిష్ఠలతో పూజించడంతో పాటు ఉపవాసం కూడా ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు ఆదాయం విశేషంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

6 / 6
మీనం: ఈ రాశికి ప్రస్తుతం రెండవ దశ ఏలిన్నాటి శని దోషం జరుగుతోంది. దీనివల్ల శ్రమ ఎక్కువ ప్రయో జనం తక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, అనారోగ్య సమస్యలు తలె త్తడం, ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గడం, ఆదాయం బాగా తగ్గడం, అనవసర ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివార్చన చేయడం వల్ల ఈ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us