
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి మహా శక్తి యోగం కలిగింది. ఈ రాశి వారు విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన శక్తియుక్తులను, నైపుణ్యాలను ఎంతో కష్ట పడి సంపాదించుకుంటారు. త్వరలో వీరి ఆశయం, ఆకాంక్ష నెరవేరడానికి అవకాశం ఉంది. విదే శాల్లో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు ఆదాయాన్ని పెంచుకోవడానికి, విదేశాల్లోనే స్థిరపడడానికి గట్టి ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది. వీరు తప్పకుండా తమ కలల్ని సాకారం చేసుకుంటారు.

కన్య: ఈ రాశికి 12వ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారికి మహాశక్తి యోగం కలిగింది. ఆర్థి కంగా బలపడడానికి వీరు కొంత కాలం పాటు శాయశక్తులా ప్రయత్నించడానికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడి, సంపన్నులు కావడం వీరికి ప్రధాన లక్ష్యం అవు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడానికి రిస్కు తీసుకోవడంతో పాటు, అదనపు ఆదాయం కోసం రాత్రింబగళ్లు కష్టపడి చివరికి తమ లక్ష్యాన్ని సాధించుకుంటారు.

వృశ్చికం: ఈ రాశికి వ్యయ స్థానంలో ప్రస్తుతం గ్రహరాజు రవి సంచారం చేస్తున్నందువల్ల ప్రభుత్వ ఉద్యోగాల కోసం గానీ, రాజకీయాల్లో పైకి రావడానికి గానీ ఈ రాశివారు అమితంగా కష్టపడే అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవడానికి, ప్రముఖులకు సన్నిహితం కావడానికి ఈ రాశివారు చేసే ప్రయత్నాలు చివరికి విజయవంతం అయ్యే అవకాశం ఉంది. సామాజికంగా ప్రాధాన్యం, ప్రాభవం, ప్రాబల్యం బాగా పెరుగుతాయి. త్వరలో ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి మహా శక్తి యోగం కలిగింది. ఉద్యోగంలో ఉన్నత పదవుల కోసం వీరు ఎక్కువగా ఆరాటపడతారు. ఒక సంస్థకు అధిపతి కావడానికి వీరు విశ్వప్రయత్నం చేసే అవకాశం ఉంది. అధికారులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. వీరి కృషి ఫలితంగా సీనియర్లను కాదని వీరికి పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా తరచూ విదేశాలకు వెళ్లడానికి వీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలిస్తాయి. వీరి లక్ష్యాలన్నీ నెరవేరుతాయి.

మీనం: ఈ రాశికి 12వ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి ఈ అరుదైన మహా శక్తి యోగం కలిగింది. విదేశాల్లో ఉద్యోగం చేయడం వీరి మొదటి ఆశయం కాగా, ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందడం వీరి రెండవ ఆశయం. ఈ ఆశయాలను సాధించుకోవడానికి వీరు తీవ్రంగా కృషి చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి వీరు గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. వీరు ఈ ఏడాది చివరి లోగా అనుకున్నది సాధించే అవకాశం ఉంది.