
మేష రాశి : మేష రాశి వారికి జనవరి 15 తర్వాత నుంచి అన్ని విధాల అనుకూలంగా ఉండనుంది. ఈ రాశి వారు ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి మకర రాశిలోకి సూర్య సంచారం వలన సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ఆదాయానికి, ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఉండవు. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని పొంది, ఆనందంగా ఉంటారు.

కన్యా రాశి :కన్యారాశి వారికి కూడా చాలా అద్భుతం ఉండనుంది. వీరికి ఆస్తి వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయి. పదోన్నతుల లభిస్తాయి. వృత్తి వ్యాపారల్లో కలిసి వస్తుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉండనుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

మకర రాశి : మకర రాశి వారికి మకర సంక్రాంతి తర్వాత తిరుగే ఉండదని చెప్పాలి. వీరికి కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా వస్తాయి. ఉద్యోగం చేసే వారు పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి.

మీన రాశి : మీన రాశి వారికి లాభ స్థానంలో రవి సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి శని దోషం చాలా వరకు తగ్గుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.