
జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే సంపదకు, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం అయిన శుక్ర గ్రహం మార్చి నెలలో హోలీ పండుగకు ముందు మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే మీనంలో శని సంచారం చేస్తున్నాడు, అయితే శని, శుక్రుల కలయిక, శుక్ర సంచారంతో నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. శక్ర గ్రహం కుంభ రాశి వారి రెండో ఇంటిలో సంచారం చేయడం వలన ఈ రాశి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి, అలాగే ఈ గ్రహం ఉచ్చ రాశిలో సంచరిస్తున్నందున వృషభ రాశి వారికి మాలవీయ రాజయోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరిక త్వరలోనే తీరనుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. శుక్ర గ్రహం సంచారం వలన వీరికి సంపద పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మీ సంపద పెరగడమే కాకుండా, ఈ సమయంలో వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి మాలవీయ రాజయోగం వలన కలిసి వస్తుంది. ఈ రాశి వారికి చాలా రోజుల నుంచి వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటిలో సానుకూల వాతావరణం నెలకుంటుంది. కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది.