Lotus Leaves Meals: 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో ఆషాడ ఉత్సవాలు.. తామర ఆకుల భోజనం వెరీ వెరీ స్పెషల్..

|

Jul 11, 2023 | 11:05 AM

ఇది ఒక పురాణ దేవాలయం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా ఆషాఢ మాసం మూడో వారంలో తోపు తిమ్మప్పస్వామికి హరిసేవ ను నిర్వహిస్తారు. ఈ హరి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రసాదం రూపంలో తామర ఆకుల్లో ఆహారాన్ని అందజేస్తారు. ఈ తామరాకు ప్రసాదాన్ని రుచి చూసేందుకు భారీ సంఖ్యలో గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు, గ్రామస్తులు వస్తుంటారు.

1 / 9
భక్తులు క్యూలైన్లలో నిలబడి దేవుడిని దర్శించుకుంటారు. హరిసేవ సందర్భంగా భారీగా బియ్యాన్ని సేకరిస్తారు. సాంబార్ అన్నం వంటలను చేస్తారు. వేలాది మంది భక్తులు సామూహికంగా నేలపై కూర్చొని తామరాకుల్లో భోజనం చేస్తారు. నేలపై కూర్చుకుని ఈ ఆకుల్లో భోజనము చేస్తారు. 

2 / 9
మండ్య జిల్లా మద్దూరు తాలూకా అబల్‌వాడి గ్రామంలో  తిమ్మప్ప స్వామి కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆషాడమాసం మూడో వారంలో తిమ్మప్పస్వామికి హరిసేవ నిర్వహిస్తారు.

3 / 9
గ్రామస్థులంతా డబ్బులు పోగుచేసి హరిసేవ ను చేస్తారు. ఈ హరిసేవలో తామర ఆకుల భోజనం ప్రత్యేక ఆకర్షణ. అలా ప్రతి సంవత్సరం ఈ హరిసేవని జరుపుతారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. సామూహికంగా ప్రసాదాల రూపంలో అన్నదానం చేస్తారు.

4 / 9

తామరాకుల్లో ఆహారం పెట్టడం కూడా ప్రత్యేకం. అందుకే చుట్టుపక్కల ఉన్న సరస్సుల నుంచి సుమారు 50 వేల తామరాకులను సేకరిస్తారు. అన్నం, సాంబారు అన్నం గుడి ముందు నేలపై వడ్డిస్తారు. ప్రసాదం నిండుగా భోజనం చేసిన వారు ఆకులో కొంచెం సాంబారు అన్నం వేస్తారు. ఈ కార్యక్రమాన్నీ నిర్వహించడానికి 15 రోజుల నుంచి సన్నాహాలు చేస్తారు. 

5 / 9
సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వందల ఏళ్లుగా ఈ తరహా హరిసేవ జరుగుతోంది. సాధారణంగా దేవాలయాల్లో అరటి ఆకుల్లో ప్రసాదం వడ్డిస్తారు.

6 / 9
ఆబలవాడి గ్రామంలోని తోపు తిప్పప్ప స్వామివారి హరిసేవేలో తామర ఆకుపైనే ప్రసాదం పెడతారు అంటే లక్షీ కమల ప్రియురాలు. ఈ విధంగా తామరాకుల్లో ప్రసాదం రూపంలో ఆహారాన్ని అందిస్తారు.

7 / 9
ఇలా తామరాకుల్లో ప్రసాదం తినడం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పడుతాయని నమ్మకం. హారతి ఇచ్చిన అనంతరం గుడిలో ప్రసాదంగా ఇచ్చే మధ్యాహ్న భోజనంలో నెయ్యి వడ్డిస్తారు.

8 / 9
వ్యవసాయ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌ చలువరాయ స్వామి ఆలయానికి చేరుకుని తామరపూవుపై ప్రసాదం స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తామరాకుల్లో భోజనం చేసేందుకు తరలివచ్చారు.

9 / 9
మొత్తం మీద శ్రీ తోపిన తిమ్మప్ప గారి హరిసేవే అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు తామర పత్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులయ్యామని సంతోషం వ్యక్తం చేశారు. 