
జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని రాశులపై దేవతల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అయితే అలాగే నాలుగు రాశుల వారు అంటే లక్ష్మీదేవికి అపారమైన ప్రేమ ఉంటుందంట. అందువలన ఎప్పడూ వారిపై అనుగ్రహం చూపెట్టడమే కాకుండా, వారికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుందంట. అందువలన లక్ష్మీ దేవి అనుగ్రహం వలన ఏ రాశుల వారికి అదృష్టం, సంపద కలుగుతుందో ఇప్పుడు చూసేద్దాం.

సింహ రాశి : సింహ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా వీరికి కలిసి వస్తుంది. వ్యాపారస్తులు గతంలో పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బును పొందుతారు. అంతే కాకుండా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. వీరికి అన్నింట్లో అద్భుతంగా కలిసి వస్తుంది.

మకర రాశి : మకర రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతే కాకుండా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది

తుల రాశి :తుల రాశి వారికి ముట్టింది ముత్యమే పట్టింది బంగారమే అవుతుంది. వీరు ఏ పని ప్రారంభించినా లేదా ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. మంచి కంపెనీలో జాబ్ దొరుకుతుంది

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు