
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికలు, రాశి మార్పు, నక్షత్ర మార్పు అనేది కామన్. అయితే కీడు గ్రహంగా భావించే కేతువు మార్చి 29న నక్షత్ర సంచారం చేయనుంది. మాఘ నక్షత్రంలోకి ఇది ప్రవేశించనుంది. దీంతో కేతు నక్షత్ర సంచారం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా అద్భుతంగా ఉంది. కేతు అనుగ్రహంతో ఈ రాశి వారు తమ పనులను చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు.

మిథున రాశి : మిథున రాశిలో జన్మించిన వారికి కేతు గ్రహం నక్షత్రం సంచారం వలన తమ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ పని ప్రారంభించినా అందులో తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని విధాలా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి

మకర రాశి : మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారికి ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారిగా ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాల కలిసి వస్తుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.