
కేదారేశ్వర్ గుహ ఆలయం అహ్మద్‌నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగడ్ కోటలో కనిపించే ఒక ప్రత్యేకమైన శివాలయం. ఈ ఆలయం ఒక గుహలో ఉంది. ఎల్లప్పుడూ నీటితో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది.

అపురూపమైన .. చూపరులను ఆకట్టుకునే అద్భుతమైన కట్టడం.. ఈ మందిరంపై ఉంది ఒక పెద్ద బండరాయి. కింద 4 స్థంబాలు పైన శివయ్య కోసం గుడి నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.

ఈ ఆలయంలో 4 యుగాలికి సంకేతాలుగా 4 స్థంబాలు వున్నాయి. సత్య యుగం,త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగాలకి గుర్తులుగా భావిస్తారు భక్తులు. ఈ స్తంభాల్లో ఒక్కటి మాత్రం ఉంది. ఆ ఒక్కదానిపైని ఆలయం నిలబడింది.

ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు ఒక్కో యుగంతనికి ఒక స్థంభం విరిగిపోతుంది. ఇప్పుడు మనం కలియుగం లో వున్నాం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్థంభం పై న మాత్రమే వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్థంభం కూడా పతనం అవుతుందో ఆ రోజు ఈ కలియుగాని కి ఆఖరి రోజు గా స్థానికుల కథనం

అంతటి మహాత్వమైన గోపురం ఉన్న ఈ ఆలయంలో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే...ఈ గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది.. అందుకనే ఈ ఆలయం లోపల చాలా చల్లగా ఉంటుంది. ఇక లోపలికియు ఎవరూ వెళ్లరు. ఒక్క వర్ష కాలంలో మాత్రం గుడిలోపల ఒక్క చుక్క నీరు కూడా ఉండదు.. వేసవి, శీతాకాలంలో 5 అడుగుల ఎత్తున నీరు ఉంటుంది.