Tulasi Puja: కార్తీక మాసంలో తులసికి ఈ నివారణలు చేయండి.. సుఖ సంతోషాలు, సిరి సంపదలు మీ సొంతం

|

Oct 20, 2024 | 4:50 PM

కార్తీక మాసం అంటే పూజల మాసం. శివ కేశవులకు అత్యంత ఇష్టమైన నెలలో ఇద్దరినీ భక్తీ శ్రద్దలతో పూజిస్తారు. శివుడితో పాటు.. విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ కాలంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు కార్తీక మాసంలో తులసిని కొన్ని పరిహారాలు చేయడం ద్వారా అదృష్టం సొంతం అవుతుందని.. జీవితంలో ఆనందం, సుఖ సంతోషాలు సొంతం అవుతాయని నమ్మకం.

1 / 6
తులసికి చేయాల్సిన నివారణలు: 
కార్తీకమాసంలో రోజూ తులసి మొక్కకు నీరు సమర్పించాలి.. అంతేకాదు సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతుష్టురాలై ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు.

తులసికి చేయాల్సిన నివారణలు: కార్తీకమాసంలో రోజూ తులసి మొక్కకు నీరు సమర్పించాలి.. అంతేకాదు సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతుష్టురాలై ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు.

2 / 6
పచ్చి పాలతో  సమర్పణ: 
కార్తీక మాసంలో ప్రతిరోజూ పచ్చి ఆవు పాలు, గంగాజలాన్ని సమర్పించడం వలన లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. ఈ పరిహారం వలన మనిషికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని విశ్వాసం.

పచ్చి పాలతో సమర్పణ: కార్తీక మాసంలో ప్రతిరోజూ పచ్చి ఆవు పాలు, గంగాజలాన్ని సమర్పించడం వలన లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. ఈ పరిహారం వలన మనిషికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని విశ్వాసం.

3 / 6
Tulasi Puja: కార్తీక మాసంలో తులసికి ఈ నివారణలు చేయండి.. సుఖ సంతోషాలు, సిరి సంపదలు మీ సొంతం

4 / 6
తులసి నైవేద్యం: 
విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. తులసి లేకుండా విష్ణువుకు సమర్పించే ఏ పూజా,  నైవేద్యం అయినా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కనుక కార్తీక మాసంలో శ్రీ మహా విష్ణువుకి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు తులసి దళాలను తప్పకుండా సమర్పించండి. ఇలా చేయడం వల్ల విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

తులసి నైవేద్యం: విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. తులసి లేకుండా విష్ణువుకు సమర్పించే ఏ పూజా, నైవేద్యం అయినా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కనుక కార్తీక మాసంలో శ్రీ మహా విష్ణువుకి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు తులసి దళాలను తప్పకుండా సమర్పించండి. ఇలా చేయడం వల్ల విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

5 / 6
తులసి మొక్కకు ప్రదక్షిణ: 
కార్తీక మాసంలో తులసి మొక్కకు ప్రత్యేక పూజలతో పాటు ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇందులో పూజతో పాటు 7, 11, 21, 51 లేదా 108 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఇలా చేయడం వలన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్మకం.

తులసి మొక్కకు ప్రదక్షిణ: కార్తీక మాసంలో తులసి మొక్కకు ప్రత్యేక పూజలతో పాటు ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇందులో పూజతో పాటు 7, 11, 21, 51 లేదా 108 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఇలా చేయడం వలన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్మకం.

6 / 6
తులసికి వివాహం: కార్తీక మాసంలో తులసికి వివాహం కూడా చేస్తారు. ఈ రోజున తులసి పూజతో పాటు.. తులసి మొక్కకు వివాహం జరిపించి.. గాజులు, పసుపు, కుంకుమ, కాలి మెట్టెలు, ఇతర వివాహ వస్తువులను సమర్పించండి. అంతేకాదు తులసి మొక్కకు ఎరుపు రంగు చునారీని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుందని నమ్ముతారు.

తులసికి వివాహం: కార్తీక మాసంలో తులసికి వివాహం కూడా చేస్తారు. ఈ రోజున తులసి పూజతో పాటు.. తులసి మొక్కకు వివాహం జరిపించి.. గాజులు, పసుపు, కుంకుమ, కాలి మెట్టెలు, ఇతర వివాహ వస్తువులను సమర్పించండి. అంతేకాదు తులసి మొక్కకు ఎరుపు రంగు చునారీని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుందని నమ్ముతారు.