
ఈ సంవత్సరం జూన్ నెలలో 29న పౌర్ణమి రానున్నది. ఇది సోమవారం రాబోతుంది. అయితే ఈ రోజు గ్రహాల కలయిక వలన అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయంట. అందువలన ఇది చాలా శుభప్రదమైనది అంటున్నారు పండితులు. అంతే కాకుండా, దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారం , ముట్టింది ముత్యమే కానున్నదంట. అన్నివిధాలుగా కలిసిరానున్నదంట.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. పౌర్ణమి తర్వాత వీరికి కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంట బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి : పౌర్ణమి తర్వాత నుంచి మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. పనుల్లో విజయం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి మంచి సంబంధం గురించి ఎదురు చూస్తున్నారో, వారికి మంచి సంబంధం దొరకడం లేదో, వారికి త్వరగా సంబంధం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

మీన రాశి : మీన రాశి వారికి ఇది చాలా మంచి సమయం. అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేర్చుకుంటారు. ఆదాయం డబుల్ అవుతుంది. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా కొత్త వ్యక్తుల పరిచయంతో ఈ రాశి వారి జీవితం మారబోతుంది

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పౌర్ణమి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. లక్కు కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి