Holi 2021: హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? రంగుల వేడుక ప్రాముఖ్యత.. పురాణాల ప్రకారం..

|

Mar 28, 2021 | 4:05 PM

Holi 2021 Festival:హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా.. జీవితంలోని సమస్యలను మరచి ఆనందంగా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. నూతన ప్రకృతికి స్వాగతం పలుకుతూ.. ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలిని జరుపుకోవడానికి గల రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 7
సతీ దేవిని కోల్పోయిన శివుడు ఒక గుహలో తప్పస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తప్పస్సు నుంచి శివుడిని మేల్కోల్పడానికి పార్వతి దేవి రాగా.. ఆమెకు సహయంగా వచ్చిన మన్మథుడు.. పరమేశ్వరుడిపైకి మన్మథ బాణాన్ని విసురుతాడు.

2 / 7
దాంతో వెంటనే తప్పస్సు నుంచి బయటకు వచ్చిన శివుడు తన మూడో కన్ను తెరచి.. మన్మథుడిని భష్మం చేస్తాడు. ఆ కామదహనమే.. హోలీ జరుపుకోవడానికి కారణమంటుంటారు.

3 / 7
 భక్త ప్రహ్లాదుడిని చంపాడానికి హిరణ్యకశిపుడు హోలికా అనే రాక్షసిని నియమిస్తాడు. అయితే ప్రహ్లదుడిని చంపాలనుకున్న హోలికా తనే అగ్నికి దహనమవుతుంది.

4 / 7
ఆ తర్వాత విష్ణు మూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని చంపుతాడు. మిక్కిలి ఆవేశంలో ఉన్న విష్ణువును శాంతింపజేయడానికి శివుడు వచ్చాడని.. దీంతో  హోలీ జరుపుకుంటారని చెప్పుకుంటారు.

5 / 7
హోలికాను దహనం చేయడం వలన చెడుపై మంచి విజయం గెలిచిందని.. హోలిక దహనం సమయంలో ప్రజలు అగ్ని చుట్టూ చేరి.. మతపరమైన కర్మలు చేసారని అంటుంటారు.

6 / 7
శాస్త్రాల ప్రకారం.. వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులను నివారించడానికి కొన్ని ఔషద మొక్కల నుంచి తయారు చేసిన సహజ రంగులు కలిపిన నీళ్ళను జల్లుకుంటారని చెబుతుంటారు.

7 / 7
కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, .మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. దీనిని జల్లుకోవడం వలన వ్యాధులు తొలగిపోతాయని నమ్ముతుంటారు.